Kantara సినిమా చూస్తూ కుప్పకూలిన వ్యక్తి.. థియేటర్ లోనే మృతి.. ఏం జరిగిందంటే?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో అత్యధిక వేగంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా కాంతర రికార్డు క్రియేట్ చేస్తోంది. ఏ భాషలో విడుదలైనా కూడా అక్కడ పెట్టిన పెట్టుబడికి సినిమా మంచి ప్రాఫిట్స్ అయితే అందిస్తోంది. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి లాభాలు అందుతున్నాయి.
ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ పేరు మీద ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అత్యధిక మంది చూసిన సినిమాలలో కాంతార కూడా నిలిచినట్లు తెలుస్తోంది. దాదాపుగా రికార్డును కూడా బ్రేక్ చేసేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రతిరోజు ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రికార్డులకు సంబంధించిన ఏదో ఒక విషయం మీడియాలో హాట్ టాపిక్ లో మారుతూనే ఉంది.

అయితే కాంతార సినిమా చూస్తూ ఒక వ్యక్తి చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని భాగమంగళ ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాంతార సినిమా చూసేందుకు తన స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న సినిమా థియేటర్ కు వెళ్ళాడు. అయితే సినిమా చూస్తూ ఉండగా మధ్యలో అతను ఒక్కసారిగా చాతిలో నొప్పి రావడంతో కుర్చీలో నుంచి చూస్తూ అలాగే కింద పడిపోయాడు.
ఇక వెంటనే అతని సన్నిహితులు థియేటర్ సభ్యులు గ్రహించి హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు కూడా ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు వివరణ ఇచ్చారు. రాజశేఖర్ మరణించడంతో ఒక్కసారిగా అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో సంతోషంగా సినిమా చూసేందుకు వెళ్లిన రాజశేఖర్ మృతిచెందినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారి షాక్ కు గురయ్యారు.


Click it and Unblock the Notifications











