For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్రెట్‌గా ప్రియుడిని పెళ్లాడిన యువ హీరోయిన్.. లాక్‌డౌన్‌లో మూడో కంటికి తెలియకుండా!

  |

  కన్నడ హీరోయిన్ మయూరి క్యాటరీ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం మీడియాలో సంచలనం రేపింది. జూన్ 12వ తేదీ ఉదయమే హీరోయిన్ పెళ్లి వార్త మీడియాలో ప్రముఖంగా మారింది. లాక్‌డౌన్ కాలంలో మయూరి పెళ్లి చేసుకోవడం, ఎవరికీ ఆహ్వానాలు పంపకుండా సీక్రెట్‌గా పెళ్లితంతు పూర్తి చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

  కొద్దికాలంగా మీడియాలో పెళ్లి వార్త

  కొద్దికాలంగా మీడియాలో పెళ్లి వార్త

  హీరోయిన్‌ మయూరికి అరుణ్ అనే బాల్య స్నేహితుడితో అఫైర్ ఉందనే వార్తలు కొద్దికాలంగా కన్నడ సినీ పరిశ్రమలో వినిపించాయి. ఆ వార్తలకు తగినట్టుగానే వారిద్దరు కలిసి కనిపించడంతో వారి మధ్య స్నేహం కంటే ఎక్కువగానే ఏదో ఉందనే మాట వినిపించింది. అలాంటి వార్తలు, కామెంట్లపై ఎన్నడూ మయూరి స్పందించలేదు.

  జూన్ 12వ తేదీన సీక్రెట్‌గా వివాహం

  జూన్ 12వ తేదీన సీక్రెట్‌గా వివాహం

  కానీ జూన్ 12వ తేదీ ఉదయం బెంగళూరులోని జేపీ నగర్‌లోని శ్రీ తిరుమలగిరి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అరుణ్‌ను హీరోయిన్ మయూరి క్యాటారీ పెళ్లి చేసుకొన్నారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం, అవి వైరల్‌గా మారడం వెంటవెంటనే జరిగిపోయింది. చిలక గోరింకాల ఉన్న నవ దంపతులకు అభిమానులు, నెటిజన్లు భారీ శుభాకాంక్షలు తెలియజేయడం కనిపించింది.

  10 ఏళ్ల స్నేహానికి నిజమైన అర్ధం, ముగింపు

  10 ఏళ్ల స్నేహానికి నిజమైన అర్ధం, ముగింపు

  తన పెళ్లి గురించి మయూరి క్యాటరీ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో అధికారికంగా స్పందించారు. అవును, నేను అరుణ్‌ను జూన్ 12వ తేదీన వివాహం చేసుకొన్నాను. పదేళ్ల మా స్నేహానికి ఈ రోజు అర్ధవంతమైన ముగింపు లభించింది. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే అందిస్తాను అని మయూరి తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేసింది.

   అందంగా మెరిసిపోయిన మయూరి

  అందంగా మెరిసిపోయిన మయూరి

  పెళ్లి బట్టల్లో మయూరి మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించారు. సొంతం డిజైన్ చేసుకొన్న బంగారం రంగు సిల్క్ చీరలో ధగధగమెరిసిపోయింది. అందంగా ముస్తాబై అందర్నీ ఆకట్టుకొన్నారు. ఇక పెండ్లి కుమారుడు అరుణ్ దక్షిణాది భారతీయ సంప్రదాయం పద్దతిలో పంచెకట్టు, తలపై పాగా ధరించి అందంగా తయారయ్యారు. ఇరు కుటుంబాలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించి పెళ్లిని నిరాడంబరంగా జరిపించారు.

  Vintage Bollywood Actress Is Now Google India Industry Head || Filmibeat Telugu
  మయూరి క్యాటారీ సినీ కెరీర్ ఇలా

  మయూరి క్యాటారీ సినీ కెరీర్ ఇలా

  మయూరి క్యాటారీ కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన వారు. 2015లో కృష్ణ లీలా అనే చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇష్టకామ్య, నటరాజ సర్వీస్, కరియా 2, రాంబో 2, జానీ జానీ ఎస్‌ పప్ప, 8ఎంఎం బుల్లెట్, రుస్తుం, నానా ప్రకార, ఆటకుంటు లేకకిల్లా, మౌనం, పొగరు లాంటి చిత్రాల్లో నటించింది. పొగరు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో మయూరి దాంపత్య జీవితం సక్సెస్ కావాలని తెలుగు ఫిల్మీబీట్ కోరుకొంటుంది.

  English summary
  Kannda Heroine Mayuri Kyatari Secret Marriage with longtime Friend Arun. He posted a message in her Instagram account that, "Yes I am married❤️ 12/06/2020 10 years of friendship given a meaning today ❤️ Vl update more shortly."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X