మేఘనా రాజ్ సీమంతం.. పక్కన భర్త కటౌట్
కన్నడ హీరో చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం ఇంకా జనాలను కలచివేస్తూనే ఉంది. 2009లో హీరోగా పరిచయం అయిన చిరంజీవి.. పదేళ్లలోనే 20 సినిమాలు నటించాడు. చేసిన 20 సినిమాల్లో దాదాపు 12 సినిమాల వరకు హిట్స్ ఉన్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన చిరంజీవి రెండేళ్ల క్రితం హీరోయిన్ మేఘన రాజ్‌ను వివాహం చేసుకొన్నారు.ప్రస్తుతం మేఘనా నిండు గర్బిణి.
అయితే తమకు పుట్టబోయే బిడ్డను ఆహ్వానించాలని, అలాగే స్నేహితులతో ట్రిప్‌కు వెళ్లాలని భావించిన చిరు అవి తీరకుండానే ఈ లోకం విడిచివెళ్లిపోయారు. కేవలం 39 ఏళ్ళ వయసులోనే ఆయన గుండెపోటుతో చనిపోవడంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అయితే ఆమధ్య ఆమె కవలలకు జన్మనిచ్చిందని పుకార్లు షికారు చేసాయి.

కానీ అవి అవాస్తవాలని తేటతెల్లం అయింది. తాజాగా మేఘనకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతికొద్దిమంది కుటుంబసభ్యులు , సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భర్త లేని లోటు కొంత తీర్చడానికి చిరంజీవి కటౌట్ ను ఆమె పక్కన ఏర్పాటు చేసారు.
ఈ ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన భర్త ఎప్పటికీ తనతోనే ఉంటాడని మేఘన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి క్షణాల్లో లక్షల్లో లైకులు వేలల్లో కామెంట్లువెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











