twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneeth : మెగాస్టార్ సినిమాలో పునీత్ స్పెషల్ రోల్.. అంతా బాగుండి ఉంటే, నవంబర్ లోనే!

    |

    శుక్రవారం నాడు మరణించిన పునీత్ రాజ కుమార్ గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒక హీరో గానే కాక సమాజ సేవకుడిగా పునీత్ రాజ కుమార్ చేసిన సేవలకు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.. అయితే ఆయన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని చాలా ఆసక్తి చూపించారు అనే విషయాన్ని తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

    పూరి జగన్నాథ్ కి అవకాశం

    పూరి జగన్నాథ్ కి అవకాశం

    కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడిగా తెరంగ్రేటం చేసిన పునీత్ రాజ్ కుమార్ బాల నటుడిగా అనేక సినిమాలలో నటించి అవార్డులు సైతం అందుకున్నారు. పూరి జగన్నాథ్ బద్రి సినిమాతో మంచి క్రేజ్ రావడంతో ఆ సినిమా చూసిన రాజ్ కుమార్ తన కుమారుడు పునీత్ రాజ్ కుమార్ ని లాంచ్ చేసే అవకాశం పూరి జగన్నాథ్ కి ఇచ్చారు.

    అప్పు సినిమాతో

    అప్పు సినిమాతో

    అలా పూరి జగన్నాథ్ ఆయనతో అప్పు అనే సినిమా చేయగా ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాక ఆయనకు అప్పు అనే పేరు స్థిరపడి పోయేలా చేసింది.. సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో ఇడియట్ పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఇడియట్ తర్వాత పూరి జగన్నాథ్ కి తెలుగులో మంచి అవకాశాలు రావడంతో ఆయన మళ్లీ కన్నడ సినీ పరిశ్రమ మీద పెద్దగా దృష్టి పెట్టలేక పోయారు..

    వీర కన్నడిగా అనే సినిమా

    వీర కన్నడిగా అనే సినిమా

    దీంతో అప్పట్లో తన దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న మెహర్ రమేష్ తో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వీర కన్నడిగా అనే సినిమా ప్రారంభించారు. ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆంధ్ర వాలా పేరుతో తెలుగులో తెరకేక్కించగా అదేసమయంలో కన్నడలో వీర కన్నడిగా పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం తో మెహర్ రమేష్ దర్శకుడిగా మొట్ట మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు.

    అజయ్ పేరుతో

    అజయ్ పేరుతో


    తర్వాత ఇక్కడ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమాని అజయ్ పేరుతో మెహర్ రమేష్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా మరోసారి తెరకెక్కించారు.. ఆ సినిమా కూడా కన్నడ మార్కెట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అలా పునీత్ రాజ్ కుమార్ తో చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని పునీత్ రాజ్‌కుమార్ ఎంతో ఆశపడినట్లు తెలిపారు. అయితే ఆయన చిరకాల కోరిక నెరవేరకుండానే కన్నుమూశారని మెహర్‌ రమేశ్‌ తెలిపారు.

    వాళ్ల ఇంటిలోనే భోజనం

    వాళ్ల ఇంటిలోనే భోజనం

    పునీత్‌ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన మెహర్‌ .. పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పునీత్‌ వల్లే తన కెరీర్‌ మొదలైందని పేర్కొన్న రమేష్ 'పునీత్‌ నటించిన 'వీర కన్నడిగా' చిత్రంతోనే నేను దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యానని, ఆ తరువాత నా రెండో ప్రాజెక్ట్‌ 'అజయ్‌' కూడా ఆయనతోనే చేశాననీ అన్నారు. అలా మా మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో నన్ను తన ఇంటి సభ్యుడిగా చూసుకునేవాడని అన్నారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ వాళ్ల ఇంటిలోనే భోజనం చేసేవాడినన్న రమేష్ మరికొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించారు.

    ఓ చిన్న స్టెప్పు వేస్తా

    ఓ చిన్న స్టెప్పు వేస్తా


    ఇటీవల 'భోళాశంకర్‌' ప్రకటించిన సమయంలో పునీత్‌ నాకు ఫోన్‌ చేశాడు అని, అభినందనలు చెప్పి.. 'చిరంజీవి సర్‌తో స్క్రీన్‌ పంచుకోవాలనేది నా కోరిక. మీరు ఛాన్స్‌ ఇస్తే ఈ సినిమాలో ఏదైనా అతిథి పాత్ర ఉంటే చేస్తానన్నారని వెల్లడించారు. లేదంటే ఏదైనా పాట లో నైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తాను' అని అడిగాడని అన్నారు.

    చిరంజీవి గారికి కూడా చెప్పా

    చిరంజీవి గారికి కూడా చెప్పా


    ఇక ఆ విషయాన్ని నేను చిరంజీవి గారికి కూడా చెప్పానని మెహర్ రమేష్ వెల్లడించారు. పునీత్‌ కోసం సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ రాయాలనుకున్నాను అని పేర్కొన్న ఆయన నవంబర్‌లో జరగనున్న మా సినిమా ప్రారంభోత్సవానికి పునీత్‌ను ముఖ్యఅతిథిగా పిలవాలనుకున్నానని అన్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది'' అని మెహర్‌ రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    meher ramesh revealed puneeth raj kumar tried to act with chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X