Banaras ప్యాన్ ఇండియా మూవీలో ఎమ్మెల్యే కుమారుడు.. అట్టహాసంగా సినీ ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే?
కర్ణాటకలో నాలుగు సార్లు ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బెనారస్ చిత్రం విడుదలకు సిద్దమైంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకొన్న ఈ సినిమాకు బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. సోనల్ మాంటీరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం భారతీయుల పవిత్ర పుణ్యక్షేత్రం బనారస్ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను ఎన్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలక్ రాజ్ బల్లాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది.
ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాల్లో జైద్ ఖాన్, సోనల్ కెమిస్ట్రీ ఆకట్టుకొంటున్నది. బనారస్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన బెనారస్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నవంబర్ 4వ తేదీన అట్టహాసంగా రిలీజ్ చేస్తున్నారు.

బెనారస్ చిత్రం కోసం జైద్ ఖాన్ నటనకు సంబంధించిన శిక్షణను ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో పొందాడు. బెనారస్ కంటే ముందు చాలా కథలు విన్నాడు. అయితే అద్బుతమైన ప్రేమ కథగా స్క్రిప్ట్ నచ్చడంతో బెనారస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే ఊపందుకొన్నాయి.
నటీనటులు: జైద్ ఖాన్, సోనల్ మాంటేరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, స్వప్న రాజ్, బర్కత్ అలీ తదితరులు
రచన, దర్శకత్వం: జయతీర్థ
నిర్మాత: తిలక్ రాజ్ బల్లాల్
బ్యానర్: ఎన్‌కే ప్రొడక్షన్స్
మ్యూజిక్: బీ అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: అద్వైత గురుమూర్తి
యాక్షన్: ఏ వుయ్, డిఫరెంట్ డానీ
డైలాగ్స్: రఘుపతి నిడువల్లి
లిరిక్స్: డాక్టర్ ఏ నాగేంద్ర ప్రసాద్
ఎడిటర్: కేఎం ప్రకాశ్
ఆర్ట్: అరుణ్ సాగర్, శ్రీను
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2022-11-04


Click it and Unblock the Notifications











