టాప్ 1లో కేజీఎఫ్ హీరో యశ్.. చివరలో శివరాజ్ కుమార్.. ఏ విషయంలోనో తెలుసా?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని భాష సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన విషయాలు, సినిమాలపై వారానికొకసారి, నెలకొకసారి సర్వే చేస్తూ ఫలితాలను వెల్లడిస్తుంది. అయితే తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి కన్నడ టాప్ 5 హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 5 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా విడుదల చేసింది. అయితే అందులో ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాప్ 1లో కేజీఎఫ్ హీరో యశ్ ఉన్నాడు. ఈయన పూర్తి పేరు నవీన్ కుమార్ గౌడ్ కాగా.. రంగస్థలంపై యష్ పెట్టుకున్నారు. 2007లో జంబాడా హుడుగి అనే సినిమా చేసిన ఈయన ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. అలాగే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనేక అవార్డులు అందుకుని స్పెషల్ రికార్డు క్రియేట్ చేశాడు.

అలాగే టాప్ 2లో సుదీప్ నిలిచారు. కేవలం హీరోగా, విలన్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా తన కెరియర్ ను కొనసాగించారు. ఈగ సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈయన 2001 నుంచి 2003 వరకు వసురగా ఫిలిం ఫేర్ పురస్కారాను అందుకున్నాడు. అలాగే కన్నడ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తున్నారు.
ఇక టాప్ 3లో దర్శన్ నిలిచాడు. కేవలం నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి పేరు సంపాధించుకున్న ఈయన 2007లో అనాథరు, 2012లో క్రాంతివీర సంగొల్లి రాయన్న అనే సినిమాల్లో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈయనకు కన్నడలో చాలా మంది అభిమానులు ఉన్నారు.
అలాగే టాప్ 4లో రక్షిత్ శెట్టి నిలిచాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్ కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. గతంలో సప్తసాగరాలు దాటి సైడ్ ఏ సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈయన దానికి నెక్స్ట్ పార్ట్ తీసుకు వచ్చారు. అయితే దీనికి కూడా చాలా బాగుందనే టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం అంతగా వసూళ్లును సాధించేకపోయింది. మరి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులన ముందుకు వస్తారో చూడాలియ
టాప్ 5లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నిలిచారు. హీరోగానే కాకుండా నిర్మాతగా, యాంకర్ గా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న 1974లో శ్రీ శ్రీనివాస కల్యాణ సినిమాతో కన్నడ సినీ రంగంలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత నుంచి వరసుగా అనేక చిత్రాలు చేస్తూ వచ్చారు. గతేడాది కబ్జా, వేద, ఘోస్ట్ అనే సినిమాలతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. మరి ఈ ఏడాది ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











