Puneethను చూసి ఏడ్చేసిన బాలకృష్ణ.. పాడె మోసేదాకా కదలనంటూ అక్కడే.. కానీ?
కన్నడ పవర్ స్టార్ గా గుర్తింపు ట తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న సెలబ్రిటీలు మాత్రమే కాక ప్రతి మనిషి షాక్ కు గురయ్యారు. ఆయనను చివరి చూపు చూసేందుకు వెళ్లిన బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకోవడం మిగతా అందరి కంటా నీరు తెప్పించే విధంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
అన్ని బాషల హీరోలతో సాన్నిహిత్యం
పునీత్ రాజ్ కుమార్ దాదాపు సౌత్ లో ఉన్న అందరు హీరోలకు కూడా మంచి స్నేహితుడనే చెప్పాలి. ఈ క్రమంలో పునీత్ మరణ వార్త గురించి తెలుసుకొని అన్ని బాషల సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు కూడా బెంగళూరు వెళ్లి రాజ్ కుమార్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు టాలీవుడ్ అగ్రహీరోలు బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు.
చాలా క్లోజ్
ఇక అందరి కంటే ముందు ఉదయాన్నే అక్కడికి వెళ్లిన నందమూరి బాలకృష్ణ పునీత్ పార్థివ దేహాన్ని అలా చూసేసరికి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. బాలకృష్ణ - రాజ్ కుమార్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో కూడా శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ లు ప్రత్యేక అతిథులుగా వచ్చారు.
విధిరాత అంటూ
ఇక పునీత్ భౌతిక కాయాన్ని చూసిన తర్వాత ఆయన తో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకొని బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చాలా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ తల కొట్టుకుని తన భావోద్వేగాన్ని ప్రదర్శించారు. బాలకృష్ణతో నిర్మాత సాయి కొర్రపాటి ఉన్నారు.
బాలయ్య ఏడుస్తున్న వీడియో వైరల్
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం అభిమానులను ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఇక పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, రానా వంటి వారు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. నందమూరి బాలకృష్ణ ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు.

రిటర్న్ టికెట్ క్యాన్సిల్
పాడే మోసిన తర్వాత ఫ్లైట్ ఎక్కుతా అని చెప్పిన నందమూరి బాలకృష్ణ, రిటర్న్ టికెట్ క్యాన్సిల్ చేసినట్లు చెబుతున్నారు. రాజ్ కుమార్ కుమార్తె విదేశాల నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముందు భావించారు. ఈ క్రమంలో సాయంత్రం వరకు కంఠీరవ స్టేడియం లోనే బాలకృష్ణ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

వాయిదా
కానీ శనివారం నాడు జరగాల్సిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం నాటికి వాయిదా వేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికీ భారీ ఎత్తున పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఆయనను చూసేందుకు కంఠీరవ స్టేడియం కు చేరుకున్నారు వారందరికీ చివరి చూపు కల్పించే ఉద్దేశంతో అంత్యక్రియలు వాయిదా వేస్తున్నామని సీఎం ప్రకటించారు. కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకుని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఆయన దయచేసి శాంతియుతంగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











