Rishab Shetty : రిషబ్ శెట్టిపై గట్టి విమర్శలు .. సొంత ఇండస్ట్రీ నుంచే చీవాట్లు
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ కారణంగా హీరోలు ఒకప్పుడు తమ స్టార్డం కాకుండా ఇతర అంశాలతో అయితే మంచి మార్కెట్‌ని సంపాదించుకుంటున్నారు. ఇలాంటి హీరోస్‌లో చాలా మంది ఒకప్పుడు బిగ్ స్టార్స్ .. ఈ కొత్త పాన్ ఇండియా హీరోస్ కంటే వెనుకబడిపోయి కూడా ఉన్నవారు లేకపోలేరు.
ఇలా పలు చిత్రాలు కంటెంట్ పరంగా కరెక్ట్ టైంలో పాన్ ఇండియా మార్కెట్‌లోకి వెళ్లి మంచి క్రేజ్ అండ్ మార్కెట్‌ని ఆ హీరోలకి తెచ్చి పెడుతున్నాయి. ఇలా మన సౌత్ నుంచే చాలా మంది హీరోస్ కూడా వెళ్లారు. తెలుగు సహా, కన్నడ నుంచి ఇలాంటి వారి లిస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఐతే మన తెలుగు హీరోస్ హిందీతో పాటు తెలుగు సినిమాలు చేసేందుకు ఎలాంటి మొహమాటం కానీ ప్రాంతీయ భేదాలు లాంటివి చూపించరు.

ఐతే కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది అని చెప్పాలి. తమ భాష అన్నా , తమ నేల అన్నా కూడా అమితమైన ప్రేమ అందుకే తమ భాషకి మాత్రం చాలా ప్రాధాన్యత, గౌరవాన్ని కూడా వారు అందిస్తారు. అలా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ యష్ కూడా తాను కన్నడలో మాత్రమే సినిమాలు చేస్తానని తేల్చిచెప్పాడు. కాకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి దర్శకులని నటీనటుల్ని మనవైపు తీసుకొస్తా అని చెప్పారు.
కానీ కన్నడకి చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ తో "సలార్" సినిమా చేయడంపై అక్కడి స్టార్ హీరో "కాంతార" నటుడు రిషబ్ శెట్టి ఇన్ డైరెక్ట్ గా పలు కామెంట్స్ చేసిన వార్తలు అప్పట్లో సంచలనంగా మారాయి. అందరూ కన్నడ సినిమాను వదిలి బయట సినిమాలు చేస్తున్నారు. కానీ నేను ఇలా చెయ్యను అంటూ రిషబ్ చేసిన స్టేట్‌మెంట్‌ని వైరల్ చేశారు.

అందరికీ చెప్పిన రిషబ్ శెట్టి ఇప్పుడు కన్నడలోనే కాకుండా తెలుగులో , అది చాలదు అన్నట్టు హిందీలో కూడా సినిమాలు వరుసగా ఓకే చేస్తుండటం తనపై గట్టి విమర్శలు తీసుకొస్తుంది. తాను మాత్రం ఇతర హీరోలు, దర్శకులపై సెటైర్స్ వేస్తారు. కానీ తాను మాత్రం ఇతర భాషల్లో సినిమాలు చేస్తారంటూ చేస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి.
నీల్ విషయంలో చెప్పిన సూక్తులు తన వరకు వచ్చేసరికి ఏమయ్యాయి ? ఇతరులు వేరే భాషలో సినిమాలు చేయకూడదు. కానీ ఇతను మాత్రం హిందీ, తెలుగు సినిమాలు చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో రిషబ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో కాంతార సినిమాతో తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటూ వస్తున్నారని చెప్పాలి. మరి రీసెంట్ గానే హిందీలో ఛత్రపతి మహారాజ్ అనే భారీ సినిమాని తాను అనౌన్స్ చేయగా హిందీలో ఈ చిత్రం 2027లో విడుదలకి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక మన తెలుగులో అయితే భారీ సీక్వెల్ "జై హనుమాన్" లో హనుమంతుని పాత్రలో రిషబ్ నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











