Bangalore Stampede: అప్పుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేయగలరా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టోర్నమెంట్‌ ప్రారంభమైన తర్వాత 18 ఏళ్ల అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించిన నేపథ్యంలో జరిగిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు పోటెత్తడంతో ఊహించని గందరగోళం నెలకొన్నది. స్టేడియం పరిసర ప్రాంతం అభిమానులతో కిక్కిరిసి పోయింది. అయితే ఈ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురికిపైగా మరణించారు. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలో ఈ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ వార్తల్లోకి వచ్చాడు. అల్లు అర్జున్ ట్రెండింగ్‌లోకి రావడానికి గల కారణం ఏమిటంటే?

ఆహ్మాదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్ జట్టు ఘన విజయం సాధించింది. ఐపీఎల్ ప్రారంభమై 18 సంవత్సరాలు అయినప్పటికీ ఆర్సీబీ జట్టు టైటిల్ గెలువలేకపోయింది. చివరకు కోహ్లీ బృందం ఐపీఎల్ విజయాన్ని చేజిక్కించుకొని ట్రోఫిని సొంతం చేసుకొన్నారు. ఈ విజయం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభిమానులు పండగ చేసుకొన్నారు. అర్ధరాత్రి సంబరాలు, ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల అభిమానులు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ కూడా చేయడం జరిగింది.

Bangalore Chinna Swamy stadium stampede

అయితే ఐపీఎల్ ట్రోఫిని గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బుధవారం బెంగళూరు చేరుకొన్నది. వారు బస్సులో ర్యాలీ చేస్తూ చిన్నస్వామి స్టేడియానికి చేరుకొన్నారు. కోహ్లీ సేనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. ఏకంగా కర్ణాటక డిప్యూటీ సీఎం జెండా పట్టుకొని ర్యాలీగా వెళ్లడం సోషల్ మీడియాలో కనిపించింది. అయితే అంచనాలకు మించి అభిమానులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలో ఏడుగురికి పైగా మరణించారు అని సమాచారం అందింది. మృతుల సంఖ్య ఎంత? అనేది ధృవీకరించాల్సి ఉంది అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

బెంగళూరు చిన్నస్వామి తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తెరపైకి వచ్చింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మరణించడం, ఓ బాబుకు తీవ్రంగా గాయపడటం అందర్నీ కలిచి వేసింది. ఈ క్రమంలో జరిగిన పరిణామాల అనంతరం ఆ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి విడుదల చేశారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేపింది.

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దుర్ఘటన నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యులు. ఆర్సీబీ విజయోత్పవం వేడుక సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో ఏడుగురు మరణించారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం పాటిస్తున్నది. హైదరాబాద్‌లో ఒక్కరు చనిపోతే అందుకు బాధ్యుడు అంటూ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ఓ చిన్నారితోపాటు ఏడుగురు మరణించారు. ఈ సంఘటను సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌లో ఎవరు బాధ్యత వహిస్తారు? పబ్లిక్‌కు సురక్షితమైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. దానికి ఎవరు బాధ్యత అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసింది.

రెండో పెళ్లికి నిహారిక రెడీ.. ఆ యంగ్ స్టార్ తో ఫిక్స్?

తెలంగాణలో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూరులో జరిగిన దుర్గటనకు బాధ్యుడిని చేస్తూ కర్ణాటక హోం మంత్రి, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలరా? అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X