Salaar: అడ్డంగా దొరికిపోయిన ప్రశాంత్ నీల్.. కన్నడ సినిమా సీన్స్ వైరల్.. మొత్తం కాపీ కొట్టేశాడుగా!
ఈ మధ్య కాలంలో ఏకధాటిగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ తన రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు రెబెలె స్టార్ ప్రభాస్. 'బాహుబలి' సిరీస్ తర్వాత ఎన్నో భారీ ప్రాజెక్టులు చేసిన అతడు.. విజయాలను మాత్రం అందుకోవడంలో విఫలం అయ్యాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో 'సలార్' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ 'సలార్: సీజ్‌ఫైర్' ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ కాపీ సీన్స్‌పై చర్చ జరుగుతోంది. ఆ వివరాలు మీకోసమే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమానే 'సలార్: సీజ్‌ఫైర్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా ఈ మూవీ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ను కూడా కలెక్ట్ చేసింది.
Recommended Video


హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. దీంతో ఈ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా రెస్పాన్స్ లభిస్తూనే ఉంటోంది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వసూళ్లు కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై కొత్త చర్చ తెరపైకి వచ్చేసింది.
'సలార్: సీజ్‌ఫైర్' మూవీలో ఎన్నో గూస్‌బమ్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ గతంలో తెరకెక్కించిన 'ఉగ్రం' మూవీ నుంచి వీటిని కాపీ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ సినిమాలో ఫైట్స్ సీన్స్ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'ఉగ్రం' మూవీ స్టోరీ లైన్‌ను మాత్రమే 'సలార్' కోసం తీసుకున్నానని ప్రశాంత్ నీల్ బహిరంగంగానే చెప్పాడు. కానీ, అందులో పెట్టిన ఫైట్స్ సీన్స్‌ను కూడా అచ్చు గుద్దినట్లు దించేశాడు. ఇప్పుడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఫలితంగా ఇది కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











