Kantara 2 రిషబ్ శెట్టి‌తో బాస్‌ పార్టీ భామ.. ఆ రిషబ్‌ పంత్‌ను వదలేసి.. దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్

భారతీయ సినిమా పరిశ్రమలో ఎలాంటి అంచనాలు, బజ్ లేకుండా వచ్చిన కాంతార చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వందల కోట్లు రాబట్టింది. విడుదలైన ప్రతీ భాషలో రికార్డు లాభాలను పంచిపెట్టింది. కంతార చిత్రం అందించిన జోష్‌తో హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను సిద్దం చేసింది. ఇక సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా చకచకా జరిగిపోతున్నది. ఈ సినిమాలో ఊర్వశీ రటేలా కీలక పాత్రను పోషించేందుకు సిద్దమైంది. ఆ అప్ డేట్ వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలో ఊర్వశి రటేలా

దక్షిణాదిలో ఊర్వశి రటేలా

ఊర్వశి రటేలా ఇటీవల కాలంలో దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. మిస్టర్ ఐరావత సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత ది లెజెండ్ అనే తమిళ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ స్పెషల్ సాంగ్‌లో వేసిన స్టెప్పులు కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.

వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ అంటూ

వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ అంటూ


వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెమ్ గర్ల్‌ కనిపించిన ఊర్వశీ రటేలా ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ పోతినేని సినిమాలో ఓ పాత్రను పోషిస్తున్నది. ఇలా దక్షిణాదిలో దూసుకెళ్తున్న ఈ బాస్ పార్టీ భామ ప్రస్తుతం కంతారలో రిషబ్ శెట్టి సరసన భారీ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో తెలియజేస్తూ.. కంతార 2 లోడింగ్.. అంటూ రిషబ్ శెట్టిని, హోంబలే ఫిలింస్‌ను ట్యాగ్ చేసింది. దాంతోపాటు రిషబ్ శెట్టితో దిగిన ఫోటోను పోస్టు చేసింది. దాంతో ఊర్వశి రటేలా ఈ సినిమాలో నటిస్తున్నట్టు అనధికారంగా కన్ఫర్మ్ అయిపోయింది.

కంతార సంచలన విజయంతో

కంతార సంచలన విజయంతో

కంతార చిత్రం విషయానికి వస్తే.. సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. 16 కోట్లతో రూపొందిన ఈ చిత్రం 400 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కన్నడ సినీ రంగంలోనే కాకుండా ఈ చిత్రం గ్లోబల్ హిట్‌గా నిలిచింది. కంతార 2 సినిమా కోసం రిషబ్ శెట్టి కన్నడ తీర ప్రాంతంలో పరిశోధన చేస్తున్నాడు.

రిషబ్ పేరు ఉంటే చాలూ... అంటూ

రిషబ్ పేరు ఉంటే చాలూ... అంటూ

అయితే రిషబ్ శెట్టితో ఊర్వశి రటేలా దిగిన ఫోటోపై నెటిజన్లు సెటైర్లు, ట్రోల్స్ భారీగా చేస్తున్నారు. రిషబ్ పంత్‌ను వదిలేసి.. రిషబ్ శెట్టిన పట్టుకొన్నావా? రిషబ్ అనే పేరు ఉంటే చాలూ. నీ లైఫ్‌లో ఎంత మంది రిషబ్ లు ఉంటారు? అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది బాలీవుడ్ ఫ్యూచర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

రిషబ్ పంత్‌తో ఊర్వశి రటేలా డేటింగ్

ఇదిలా ఉండగా, క్రికెటర్ రిషబ్ పంత్‌తో ఊర్వశి రటేలా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పమన్నాయి. రిషబ్ పంత్‌తో కూడిన క్రికెట్ జట్టు ఎక్కడ ఉంటే.. అక్కడికి వెళ్లి ఊర్వశీ హల్‌చల్ చేసింది. అయితే ఇటీవల రిషబ్ పంత్ యాక్సిడెంట్‌కు గురై ఇప్పడిప్పుడే కోలుకొంటున్నాడు. ఈ క్రమంలోనే ఊర్వశి రటేలాపై అలాంటి కామెంట్స్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X