రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌లో కొత్త కోణం.. యువ హీరో కారణమంటూ..
యువ తార రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వ్యవహారం టాలీవుడ్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. కన్నడ కిరిక్ పార్టీకి ముందే ప్రేమలో పడిన రష్మిక, రక్షిత్ శెట్టి.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరుపుకొన్నారు. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కన్నడలోనే కాకుండా తెలుగు చిత్రాల్లో బిజీగా మారారు. ఈ నేపథ్యంలో రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిందనే వార్త సంచలనం రేపింది.
Recommended Video


వరుస ఆఫర్లతో రష్మిక
చలో సినిమాలో యువ హీరో నాగశౌర్యతో రష్మిక నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఆ తర్వాత వరుస ఆఫర్లు రష్మికను పలుకరించాయి. ప్రస్తుతం రష్మిక నటించిన గీతా గోవిందం విడుదల కానున్నది. ఈ చిత్రం విడుదల కాకుండానే విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్‌లో జతకట్టింది.

బ్రేకప్ వార్త వైరల్
గీతా గోవిందంతోపాటు రష్మిక డియర్ కామ్రేడ్ చిత్రంతోపాటు, దేవదాస్ చిత్రంలో కూడా నటిస్తున్నది. ఇంకా కొన్ని చిత్రాలను ఆమె అంగీకరించాల్సి ఉంటుంది. డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేయడం వెనుక విజయ్ దేవరకొండ స్పెషల్ ఇంట్రస్ట్ చూపించాడనే వార్త వైరల్ అయింది. ఇలాంటి నేపథ్యంలో రష్మిక బ్రేకప్ వార్తలు జోరందుకున్నాయి.

కన్నడ పరిశ్రమలో ప్రకంపనలు
కన్నడ చిత్ర పరిశ్రమలో రష్మిక బ్రేకప్ వార్తలు సంచలనం రేపాయి. తమపై వస్తున్న వార్తలపై అటు రక్షిత్ శెట్టి గానీ, ఇటు రష్మిక గానీ కామెంట్ చేయలేదు. అయితే రష్మిక టీమ్ ఈ వ్యవహారంపై స్పందించింది. రక్షిత్, రష్మిక మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వారిద్దరూ రిలేషన్ బాగా ఉంది. వారిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని వారు పేర్కొన్నారు.

యువ హీరోతో స్పెషల్ రిలేషన్
తెలుగులో బిజీ కావడం, యువ హీరోతో సన్నిహితంగా ఉండటం అనే అంశాల కారణంగా బ్రేకప్ వార్తలు జోరందుకొన్నాయి. ప్రధానంగా యువ హీరోతో స్పెషల్ రిలేషన్ కొనసాగుస్తున్నారనే ఊహాగానాలు మీడియాలో రావడం ఈ బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరింది. ఏది ఏమైనా బ్రేకప్ వార్తకు తొందరగానే తెరపడటం రష్మికకు ఊరట కలిగించినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











