twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెయిటర్ మీద దర్శన్ దాడి... కొత్త ట్విస్ట్ వెలుగులోకి!

    |

    ఈ మధ్య కాలంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ వార్తల్లోకి ఎక్కుతున్నాడు, అయితే అవన్నీ వివాదాస్పద అంశాలే కావడం గమనార్హం. ఆయన మైసూరులో వెయిటర్‌పై దాడి చేశాడనే ఆరోపణలతో నటుడు దర్శన్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

    హోంమంత్రికి ఫిర్యాదు

    హోంమంత్రికి ఫిర్యాదు


    సినీ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ గురువారం బెంగళూరులో హోంశాఖ మంత్రి బసవరాజ బొమ్మైని కలిసి దర్శన్‌ వ్యవహారంలో మొత్తం ఎపిసోడ్‌పై దర్యాప్తు జరిపించడంతో పాటు మైసూరులోని ఓ హోటల్‌లో చోటుచేసుకున్న సంఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండు చేశారు. హోటల్‌ సంఘటన గురించి ఇంద్రజిత్‌ కీలక వివరాలు కూడా ఆరోజున వెల్లడించారు.

    చీపురు తీసుకుని హోటల్‌కు

    చీపురు తీసుకుని హోటల్‌కు

    ఇటీవల మైసూరులోని ప్రిన్స్‌ సందేశ్‌ హోటల్‌లో నటుడు దర్శన్‌, ఆయన సన్నిహితులు రాకేశ్‌, హర్ష తదితరులు విందుకు వెళ్లారు. వారితో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని, ఆ సమయంలో దర్శన్‌ అక్కడి వెయిటర్‌పై దాడిచేశారని పేర్కొన్నారు. ఫలితంగా ఆ వెయిటర్‌ కంటికి దెబ్బలు తగిలాయన్న ఆయన అప్పుడే. చూపు కూడా మందగించిందని దీంతో బాధితుడి భార్య మరుసటి రోజున చీపురు తీసుకుని హోటల్‌కు వెళ్లగా రాజీకుదుర్చుకుని, ఘటన బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నారని పేర్కొన్నారు.

     గాయపరిచారని

    గాయపరిచారని

    మైసూరులోని ఒక హోటల్ వెయిటర్‌పై కన్నడ నటుడు దర్శన్ మరియు అతని స్నేహితులు గాయపరిచారు అని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ పేర్కొన్నారు. ఈ సంఘటన 4 నెలల క్రితం జరిగగా కేసును పరిష్కరించడానికి వెయిటర్‌కు రూ .50 వేలు ఇచ్చినట్లు ఇంద్రజిత్ లంకేష్ హోం మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి నా దగ్గర రుజువు ఉందని, డాని ఆధారంగా నేను హోంమంత్రిని చర్య తీసుకోవాలని అభ్యర్థించాను" అని ఇంద్రజిత్ పేర్కొన్నారు.

    కొత్త మలుపులు

    కొత్త మలుపులు

    అయితే ఈ కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ సంఘటన తనను ఫ్రేమ్ చేయడానికి సృష్టించిందని దర్శన్ పేర్కొన్నాడు. ఒక మీడియా ప్రసంగంలో, దర్శన్ ఈ ఆరోపణపై స్పందిస్తూ, హోటల్‌లో ఒక చిన్న గొడవ జరిగిందనేది నిజమే కాని అది ఇంత జరగలేదని వెల్లడించారు. "ఆర్డర్ ఎందుకు ఆలస్యం అవుతుందో అడగడానికి నేను వెయిటర్ వద్ద నా గొంతు పెంచానని కానీ ఇంద్రజిత్ కొట్టానని ఆరోపించాడని అన్నారు.

    హోటల్ యజమాని కూడా

    హోటల్ యజమాని కూడా

    ఇక హోటల్ యజమాని ఈ సంఘటనను ఖండించారు. హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ సందేశ్ నాగరాజు కుమారుడు మాట్లాడుతూ, దర్శకుడు వెయిటర్ మీద కోప్పడడం నిజమే కానీ అతనిని కొట్టలేదని అన్నారు. "మా హోటల్ లో లాక్ డౌన్ చేయడానికి ముందు దర్శన్ పూల్ సైడ్ పార్టీని చేసుకున్నారని, అప్పుడు మా వెయిటర్ పై దాడి చేయలేదు, కానీ సర్వీస్ ఆలస్యం అయినందుకు అతని మీద గట్టిగా అరిచాడని అన్నారు. నేను ఇద్దరినీ శాంతింపజేసానని అన్నారు.

    Read more about: darshan
    English summary
    Kannada star Darshan has hit the headlines yet again for allegedly assaulting a waiter in Mysuru. Director Indrajit Lankesh gave a statement against the Kannada actor and his friends for attacking the waiter of a hotel in Mysuru leaving him severely injured. new twist arised in this case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X