టీవీ నటుడి విడాకుల కేసులో కొత్త మలుపు.. వదిలేది లేదంటూ భార్య ట్విస్టు
కన్నడ బుల్లితెర నటుడు రాజేశ్, ఆయన భార్య శ్రుతి రాయికర్ విడాకుల వివాదం మరో మలుపు తిరిగింది. వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని తన అత్త మంజులపై కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో శృతి ఫిర్యాదు చేయడం ఆ మధ్య సంచలనం రేపింది. దాంతో 498ఏ (వరకట్న వేధింపులు), వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 4 కింద (వరకట్న డిమాండ్) కింద కేసు నమోదు చేశారు. 2017లో రాజేష్‌ను వివాహం చేసుకొన్నప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని తన ఫిర్యాదులో శృతి పేర్కొన్నారు. శృతి ఫిర్యాదులో ఏముందంటే..

మరో పెళ్లి చేస్తామని
ఇటీవల కాలంలో తన అత్త, రాజేష్ తల్లి మంగళ భట్ వేధింపులు ఎక్కువైనాయి. నీ మంగళ సూత్రం కోసం భారీగా డబ్బులు ఖర్చుచేశాం. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని పోరు పెడుతున్నారు. నీవు అంగీకరిస్తే నా కుమారుడికి మరో పెళ్లి సంబంధం చూస్తానని వేధించింది. అలాగే నా భర్త రాజేష్ కూడా నన్ను పలుమార్లు కొట్టడం, దుర్బాషలాడటం చేశాడు. అంతేకాకుండా ఇళ్లు కొనివ్వమని నా పుట్టింటి వారిని వేధించారు అని శృతి ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరో మహిళతో రిలేషన్?
తన భర్త రాజేష్‌కు మరొకరితో ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం కూడా కలుగుతున్నదని శృతి ఆరోపించారు. శృతి చేసిన ఫిర్యాదు, ఆరోపణలను ఆధారంగా చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాం. బాధితురాలి అనుమానంతోనే తప్ప.. సాక్ష్యాలు లేవు. ఆ కోణంలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు. శృతి ఫిర్యాదుపై గత ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.

నా తల్లిని వేధిస్తూన్నారని
ఇదిల ఉండగా, శృతిపైన కూడా భర్త రాజేష్ ఆరోపణలు చేశాడు. మాది సంప్రదాయ కుటుంబం. శృతి బయట మాంసం తిని.. ఇంట్లోకి వచ్చి తన తల్లిని వేధిస్తున్నది. కట్నం తీసుకు రమ్మని వేధించలేదు. విడాకులు కావాలని గతంలో శృతి కోర్టులో కేసు వేసింది. కట్నం కోసం తాను వేధించినట్టయితే.. అప్పట్లో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాజేష్ నిలదీశాడు.

విడిపోను.. కలిసే ఉంటాను.. కొత్త ట్విస్టు
అయితే ఈ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. రాజేష్‌తో విడిపోయేది లేదు. అతడితోనే కలిసి ఉంటానని శృతి పేర్కొనడంతో ఈ కేసు ట్విస్టుగా మారింది. రాజేష్ ముఖం చూసి పెళ్లి చేసుకోలేదు, అతడి మనసు చూసి వివాహం చేసుకొన్నాను. విడాకుల కోసం నేను ఆర్జీ పెట్టుకోలేదు, తనకు డైవోర్స్ తీసుకోవడం ఇష్టం లేదని పేర్కొన్నది. పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేసిన తర్వాత శృతి ప్లేట్ ఫిరాయించడం ఆసక్తిగా మారింది. తన భర్త తల్లి వరకట్నం కోసం వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారన్నారు.


Click it and Unblock the Notifications











