twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదాల నడుమ నిఖిల్ వివాహం.. లాక్‌డౌన్‌లో నిరాడంబరంగా హై ప్రొఫైల్ పెళ్లి

    |

    లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా, కుటుంబ సభ్యుల దీవెనల మధ్య యాక్టర్, పొలిటిషియన్ నిఖిల్ కుమారస్వామి వివాహం నిరాడంబరంగా జరిగింది. బెంగళూరుకు 28 కిలో మీటర్ల దూరంలోని తమ ఫామ్‌హౌస్‌లో పెళ్లి కుమార్తె రేవతి మెడలో నిఖిల్ తాళి కట్టారు. కరోనావైరస్ కారణంగా విధించిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఈ వివాహం జరపడంతో వివాదంగా మారింది. వివరాల్లోకి వెళితే.

     బలమైన రాజకీయ నేపథ్యంతో

    బలమైన రాజకీయ నేపథ్యంతో

    పెళ్లి కుమారుడు నిఖిల్‌కు బలమైన రాజకీయ నేపథ్యం ఉండటం, తండ్రి మాజీ సీఎం, తాతా మాజీ ప్రధాని కావడంతో ఈ పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పెళ్లిపైనే దేశవ్యాప్తంగా దృష్టిపడింది. లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేయడం ఏమిటని అనుకూల, ప్రతికూల వాదనలతో గతవారమంతా కన్నడ మీడియాలో చర్చ జరిగింది.

     వేద పండితుల ముహుర్తానికే

    వేద పండితుల ముహుర్తానికే

    లాక్‌డౌన్‌కు ముందే నిఖిల్, రేవతి పెళ్లికి ముహుర్తాలు పెట్టారు. కోవిడ్ 19 కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. లాక్‌డౌన్ పొడిగింపుతో పెళ్లి విషయం మరింత వివాదంగా మారింది. ఎలాగైన వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికే వివాహం జరిపించాలని నిఖిల్ కుటుంబ సభ్యులు నిర్ణయిచండంతో ఈ అంశంపై మీడియాలో ఆసక్తి పెరిగింది.

    సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూనే

    సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూనే

    తొలుత ఇంటిలోనే పెళ్లిని జరిపించాలని ఇరు కుటుంబాలు భావించాయి. అయితే లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం కష్టంగా మారుతుందనే కారణంతో పెళ్లి వేడుకను తమ ఫామ్‌హౌస్‌కు షిప్ట్ చేశారు. ఈ వేడుకను బిదాడికి సమీపంలోని కేతగానహళ్లి పట్టణంలోని ఫామ్‌హౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకను వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికే నిర్వహించడం విశేషం.

     హై ప్రొఫైల్ పొలిటికల్ మ్యారేజ్‌

    హై ప్రొఫైల్ పొలిటికల్ మ్యారేజ్‌

    నిఖిల్ కుమారస్వామి వివాహం చేసుకొన్న రేవతి మాజీ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు. దాంతో ఈ పెళ్లికి కర్ణాటకలోనే కాకుండా దక్షిణాదిలో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పెళ్లికి మాజీ పీఎం దేవగౌడతో, పలువురు ప్రముఖులతోపాటు సుమారు 100 మంది హాజరయ్యారని తెలుస్తున్నది. ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

    Recommended Video

    Nikhil Siddharth About His Honeymoon
    పొలిటికల్, సినీ కాంబినేషన్‌తో

    పొలిటికల్, సినీ కాంబినేషన్‌తో

    ఇక నిఖిల్ విషయానికి వస్తే.. జాగ్వర్ అనే చిత్రం ద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయన రాజకీయ జీవితానికి కొంత మచ్చ పడింది. త్వరలోనే ఓ చిత్రంలో నటించేందుకు నిఖిల్ సిద్ధమవుతున్నారు.

    English summary
    Actor, Politician Nikhil Kumaraswamy tied knot to Revathi. Former Prime Minister HD Deve Gowda's grandson Nikhil Kumaraswamy will marry Revathi, the grandniece of a former minister, at a farmhouse about 28 km from state capital Bengaluru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X