లుక్ అదిరిపోయింది: ‘పహిల్వాన్’ పోస్టర్ రిలీజ్ చేసిన చిరంజీవి!
కన్నడ స్టార్ సుదీప్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'పహిల్వాన్' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయా ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్లతో ఫస్ట్ లుక్ లాంచ్ చేయించారు.
తెలుగులో ఈ పోస్టర్ మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... సుదీప్ లుక్ అద్భుతంగా ఉందని, తెలుగులో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మలయాళం పోస్టర్ మోహన్ లాల్, తమిళ పోస్టర్ విజయ్ సేతుపతి, హిందీ పోస్టర్ సునీల్ శెట్టి రిలీజ్ చేశారు.

'పహిల్వాన్' మూవీ ఐదు భాషల్లో విడుదలవుతుండటం... చిరంజీవి సర్, మోహన్ లాల్ సర్, సునీల్ శెట్టి సర్, విజయ్ సేతుపతి సర్ విడుదల చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు ఎస్. కృష్ణ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సుదీప్ బాక్సర్‌గా కనిపించబోతున్నారు.
'పహిల్వాన్'లో సుదీప్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా..., సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్, శరత్ లోహితశ్వ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 9న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుదీన్ కెరీర్లో విడుదలవుతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది.



Click it and Unblock the Notifications











