పవిత్ర లోకేష్‌ది దోచుకొనే మనస్తత్వం..డబ్బుపై దురాశ ఎక్కువ..నరేష్‌తో ఆరు నెలలే.. భర్త సుచేంద్ర ప్రసాద్ ఆరోపణలు

టాలీవుడ్ నటుడు వీకే నరేష్, నటి పవిత్రా లోకేష్ అఫైర్ వ్యవహారం దక్షిణాది మీడియాలో సంచలనం రేపుతున్నది. అయితే పవిత్రా లోకేష్ కన్నడ నటి కావడంతో కర్ణాటక మీడియాలో ఆమె వ్యవహారం సంచలన కథనాలకు వేదికగా మారింది. అయితే ఇటీవల స్ట్రింగ్ ఆపరేషన్‌లో పవిత్ర లోకేష్ చెప్పిన మాటలకు భిన్నంగా ఆమె భర్త సుచేంద్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. అలాగే వీకే నరేష్ కన్నడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అత్యంత వివాదంగా మారాయి. ఈ క్రమంలో పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర మీడియాతో మాట్లాడుతూ...

నచ్చ చెప్పే ప్రయత్నం చేశా

నచ్చ చెప్పే ప్రయత్నం చేశా

పవిత్రా లోకేష్‌తో జీవితం తొలినాళ్లలో బాగానే ఉంది. మాకు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత వదిలేసి వెళ్లింది. ఆమెది కాపురాలను కూల్చే బుద్ది. ఒక నటిగా ఉన్న ఆమెకు ఇలాంటి తీరు మంచిది కాదు. చాలాసార్లు నేను ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె తీరు మార్చుకోలేదు. పవిత్ర నన్ను వదిలేసి వెళ్లిన తర్వాత నేను చాలా బ్యాలెన్స్‌గా ఉన్నాను. నాకు ఇష్టమైన సాహిత్య జీవితంతో కాలం వెళ్లదీస్తున్నాను. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒంటరి జీవితమే బాగుందనిపిస్తుంది అని సుచేంద్ర ప్రసాద్ తెలిపారు.

మోసం చేస్తే..చెప్పులు కూడా అంటూ

మోసం చేస్తే..చెప్పులు కూడా అంటూ

సుచేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖ కవి లక్ష్మీనారాయణ్ భట్ కవితను చదివారు. నిశ్చలంగా ఉన్న నీళ్లను కదలించకూడదు. అందంగా కనిపించే పువ్వు రేకులను ముళ్లతో నాశనం చేయకూడదు. మనల్ని ఎవరైనా మోసం చేశారనిపిస్తే.. వారి వద్ద చెప్పులు కూడా వదలకూడదు అనే కవితను చదివి వినిపించాడు.

నా దగ్గర డబ్బు లేదని.. విడిచి వెళ్లింది

నా దగ్గర డబ్బు లేదని.. విడిచి వెళ్లింది

పవిత్ర లోకేష్ రిలేషన్‌లో మొదటి నుంచి ఓటమే. ఈమె వల్ల ఎవరికో అన్యాయం జరిగింది. డబ్బులు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడమే పవిత్రా లోకేష్ లక్ష్యం. ఆర్థికంగా నేను ఆమె స్థాయికి లేకపోవడం వల్ల నన్ను విడిచిపోయింది. నాకు మోసం చేసి వెళ్లిపోయింది సుచేంద్ర ప్రసాద్ అన్నారు.

కాపురాలు కూల్చే వ్యక్తి

కాపురాలు కూల్చే వ్యక్తి

నేను కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తానని చెప్పింది. ఒకవేళ నేను కోపం చేస్తే వెళ్లిపోయి నరేష్‌తో ఉండటం కరెక్టా? మరో కాపురాన్ని కూల్చడం కరెక్టేనా? ఆమెకు కాపురాలు కూల్చడం అలవాటే. వీలును బట్టి, సమయం చిక్కితే ఎంత దొరికితే అంత దోచుకొనే మనస్తత్వం పవిత్రా లోకేష్‌ది. ఆమెకు జీవితంపై ఆశలు ఎక్కువ. అందుకే నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని భర్త సుచేంద్ర ప్రసాద్ తెలిపారు.

దోచుకొనే మనస్తతం పవిత్ర లోకేష్‌ది

దోచుకొనే మనస్తతం పవిత్ర లోకేష్‌ది

ప్రస్తుతం పవిత్రా లోకేష్‌పై స్పందించే పరిస్థితి లేదు. నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను. పవిత్రా లోకేష్ దోచుకొనే మనస్తత్వం. పవిత్రా లోకేష్‌కు కష్టపడే మనస్తత్వం లేదు. ప్రస్తుతం నన్ను వదిలేసి.. నరేష్‌ను పట్టుకొన్నది. ఒకేవేళ నరేష్‌ను పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకొన్నా.. ఆరు నెలల్లో వదిలేస్తుంది. డబ్బు చేతికి రాగానే ఆమె నరేష్‌ను కూడా వదిలేస్తుంది. పవిత్రా లోకేష్ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు అని సుచేంద్ర ప్రసాద్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.

సుచేంద్ర ప్రసాద్ ఎవరంటే?

సుచేంద్ర ప్రసాద్ ఎవరంటే?

సుచేంద్ర ప్రసాద్ విషయానికి వస్తే.. సాహిత్యకారుడిగా, నటుడిగా కన్నడ రంగంలో మంచి పేరు ఉంది. నటుడిగా రాణిస్తున్న సమయంలోనే పవిత్ర లోకేష్‌తో రిలేషన్ ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో సామరస్యంగా విడిపోయారు. ప్రస్తుతం సుచేంద్ర ప్రసాద్ ఒక సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్దమవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X