బలమైన కారణం కోసం కొట్టేవాడు ‘యోధుడు.. ‘పహిల్వాన్’ ట్రైలర్ కేక

కన్నడ స్టార్ సుదీప్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'పహిల్వాన్'. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో విడుదల చేస్తున్నారు. తాజాగా 'పహిల్వాన్' ట్రైలర్ విడుదలైంది. వారాహి చలన చిత్రం బేనర్ వారు తెలుగులో దీన్ని విడుదల చేస్తున్నారు.

'బలం కన్నా ధైర్యంతో కొట్టేవాడు రౌడీ. బలమైన కారణం కోసం కొట్టేవాడు 'యోధుడు' అనే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలైంది. ఇందులో సుదీప్... కృష్ణ అనే పహిల్వాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కృష్ణ గురువు పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించాడు. దేవుడు అందరికీ కలలను ఇస్తాడు.. కానీ ఆకలే కలలను తినేస్తుంది అనే డైలాగులు ఎమోషనల్‌గా ఉన్నాయి.

Pehlwaan Telugu Official Trailer

'పహిల్వాన్' మూవీ ఐదు భాషల్లో విడుదలవుతుండటంతో తెలుగులో చిరంజీవి, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సునీల్ శెట్టి, తమిళంలో విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఇప్పటికే ఫస్ట్ పోస్టర్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఎస్. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

'పహిల్వాన్'లో సుదీప్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా..., సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్, శరత్ లోహితశ్వ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుదీన్ కెరీర్లో విడుదలవుతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X