అమరన్ థియేటర్‌పై బాంబులతో దాడి .. ఉలిక్కిపడ్డ కోలీవుడ్ , ఎవరి పని?

భారతదేశంలో సినిమా ఒక మతమైతే నటీనటులు ఇలవేల్పులు. వారి కోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ అడుగడుగునా ఉన్నారు. నార్త్‌లో ఈ కల్చర్ తక్కువేమో గానీ సౌత్‌లో హీరోల ఫ్యాన్స్ ఓవరాక్షన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. తమ అభిమాన నటీనటుల సినిమాల రిలీజ్ సమయంలో థియేటర్లను అందంగా ముస్తాబు చేస్తారు ఫ్యాన్స్. ఇక పుట్టినరోజు నాడు రక్తదానాలు, అన్నదానాలు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల సంగతి సరేసరి. అయితే బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఫ్యాన్ వార్ కల్చర్ నేటికీ కొనసాగుతోంది. తమ హీరోలను ఎవరైనా ఏమైనా అంటే చాలు మరో హీరో అభిమానులపైకి దాడికి దిగడం , చివరికి ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇదిలాఉండగా.. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కోలీవుడ్ అగ్ర కథనాయకుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్‌ను దాదాపు రూ. 130 కోట్ల పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.

Petrol bombs hurled on cinema theatre screening Amaran in at Tamil Nadu

విడుదలైన రెండు వారాలకు గాను అమరన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 263.40 కోట్ల గ్రాస్.. రూ.129.75 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.62.75 కోట్ల లాభాలను అందించింది. ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమలో రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా అమరన్ నిలిచింది. నేడో రేపో ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు అమరన్ తర్వాత శివకార్తీకేయన్ రేంజ్ మారిపోతుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

ఇలాంటి దశలో నవంబర్ 14న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా, తెలుగు యువ నటుడు మట్కా సినిమాలు రిలీజ్ కావడంతో అమరన్ తట్టుకుని నిలబడగలడా అనే చర్చ సినీ వర్గాల్లో నడిచింది. ఇంతటి టఫ్ ఫైట్‌లోనూ అమరన్ నిలబడ్డాడని , 16వ రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరన్ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

తిరునల్వేలి జిల్లాలోని ఓ థియేటర్‌లో అమరన్ ప్రదర్శితమవుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హాల్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న గొడవల కారణంగానే ఓ వర్గం దాడికి దిగినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చారు. మరోవైపు అమరన్ థియేటర్‌పై బాంబు దాడి జరిగిన విషయం తెలుసుకున్న కోలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

More from Filmibeat

Read more about: amaran tamil nadu sivakarthikeyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X