Just In
- 27 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాజీ సీఎం కుమారుడి నిశ్చితార్థం.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
మాజీ పీఎం దేవె గౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆ మధ్య జాగ్వార్ అనే ఓ చిత్రంతో టాలీవుడ్‌ను పలకరించాడు. అయితే ఆ చిత్రం బెడిసికొట్టడంతో మళ్లీ ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. అయితే తాజాగా నిఖిల్ గౌడ వార్తల్లో నిలిచాడు. నిఖిల్ ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. నిఖిల్ నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కలిసి రాని సినిమాలు
నిఖిల్ గౌడకు అవకాశాలు వస్తున్నా.. సినిమాలు మాత్రం ఆడటం లేదు. మొదటి ప్రయత్నంగా చేసిన ద్విభాషా చిత్రం జాగ్వార్ రెండు చోట్లా బెడిసికొట్టింది. ఆపై కన్నడలో చేసిన సీతారామ కళ్యాణ చిత్రం కూడా అంతగా మెప్పించలేకపోయింది. ఆ మధ్య భారీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కించిన కురుక్షేత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంలో అభిమన్యుడి పాత్రను పోషించాడు. అయితే ఈ సినిమా కూడా ఇతనికి పేరును తీసుకురాలేకపోయింది.

రాజకీయాల్లోనూ ఎదురుదెబ్బే..
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మరణానంతర జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుమలత ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమె మీద నిఖిల్ గౌడ ఎంపీగా పోటీ చేశాడు. అయితే ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారే అయినా.. స్వర్గీయ అంబరీష్ క్రేజ్ ముందు నిఖిల్ తట్టుకోలేకపోయాడు. ఆయన మరణంతో.. సుమలతకు సింపతీ ఓట్లు బాగానే పడ్డాయి. దీంతో రాజకీయాల్లోనూ నిఖిల్‌కు చుక్కెదురైంది.

నిఖిల్ నిశ్చితార్థం..
కాంగ్రెస్ నాయకుడైన క్రిష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖలు సందడి చేశారు. సోమవారం జరిగిన ఈ వేడుకలో దేవే గైడ, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఇలా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఏప్రిల్‌లో పెళ్లి..
ఇక నిఖిల్-రేవతిల వివాహం ఏప్రిల్ మాసంలో జరగనున్నట్టు తెలుస్తోంది. కుమారస్వామి నియోజకవర్గమైన రామనగరలోనే వీరి వివాహం జరుగుబోతోన్నట్లు సమాచారం. నిఖిల్ ప్రస్తుతం విజయ్ కుమార్ కొండాతో మరో ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు.