Drugs Caseలో నటి సోనియా అగర్వాల్ అరెస్ట్.. వాష్‌రూమ్‌లో దాక్కున్నా లాక్కొచ్చారుగా!

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఇపటికే సంజనా, రాగిణిలు అరెస్ట్ కాగా వారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక తాజాగా శాండల్‌ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నటి ఇప్పుడు అరెస్టైంది. శాండల్‌వుడ్ నటి సోనియా అగర్వాల్ ఇంట్లో గంజాయి దొరికింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

నటి ఇంట్లో గంజాయి

నటి ఇంట్లో గంజాయి

బెంగళూరు సౌత్ జోన్ పోలీసులు ఈరోజు ముగ్గురు వ్యాపారవేత్తలు మరియు ప్రముఖుల ఇళ్ళ మీద దాడి చేశారు. నటి సోనియా అగర్వాల్ ఇంటి పై జరిపిన దాడిలో దాదాపు 40 గ్రాముల గంజాయి దొరికినట్లు చెబుతున్నారు. కాస్మెటిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నటి సోనియా అగర్వాల్ కొందరు ప్రముఖులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. బెంగుళూరులోని వివిధ ప్రాంతాలలో నైజీరియన్ జాతీయులకు సంబంధించిన డ్రగ్ పెడ్లింగ్ ఆరోపణల నేపధ్యంలో ఈస్ట్ డివిజన్ పోలీసులు సోమవారం ఉదయం ప్రముఖుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఏకకాలంలో ముగ్గురి మీద

ఏకకాలంలో ముగ్గురి మీద

ఈస్ట్ డివిజన్ పోలీసుల ప్రకారం ప్రముఖులు, శాండల్‌వుడ్ నటి సోనియా అగర్వాల్, DJ వచన్ చిన్నప్ప మరియు వ్యాపారవేత్త భరత్ లు ఈ లిస్టులో ఉన్నారు. పోలీసుల ప్రకారం, ఈ ప్రముఖులు కొన్ని రోజుల క్రితం డ్రగ్ పెడ్లింగ్ ఆరోపణలపై అరెస్టయిన నైజీరియన్ జాతీయులతో టచ్‌లో ఉన్నారు. రాజాజీ నగర్, బెన్సన్ టౌన్ మరియు బనశంకరిలోని ప్రముఖుల ఇళ్లపై పోలీసు బృందాలు దాడి చేశాయి. "గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన డ్రగ్ పెడ్లర్ కేసుకి సంబంధించి, ముగ్గురు ప్రముఖుల పై ఆరోపణలు ఉన్నాయి. మేము తగినంత సాక్ష్యాలను సేకరించాము. ఈ ప్రాంతాల్లో ప్రముఖుల ఇళ్లలో మూడు వేర్వేరు బృందాలు సోదాలు నిర్వహించి వివరాలను పొందాము, "అని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

వాష్ రూమ్లో దాక్కుంటే

వాష్ రూమ్లో దాక్కుంటే

ఇక ఈ శాండల్‌వుడ్‌లో డ్రగ్ నెట్‌వర్క్‌ తో సంబంధం ఉన్న నటి సోనియా అగర్వాల్, డిజె వచన్ చిన్నప్ప మరియు వ్యాపారవేత్త భరత్‌ను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. బెంగుళూరులోని గోవిందపుర పోలీసుల సహాయంతో నిందితులను అరెస్టు చేసి విచారణకు తీసుకున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన ఆకస్మిక దాడిలో, 50 గ్రాముల మాదక ద్రవ్యాలు సోనియా అగర్వాల్, రాజాజీనగర్, DJ వచన్ నివాసంలో కనుగొనబడ్డాయి. మొదట్లో మోడల్ సోనియా అగర్వాల్ పోలీసులకు చిక్కలేదు. పోలీసుల దాడి గురించి తెలుసుకున్న సోనియా ఒక ప్రైవేట్ హోటల్‌లో బస చేశారు. హోటల్ గదిలోని వాష్‌రూమ్‌లో దాక్కున్న సోనియాను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో, ఆమె వాష్‌రూమ్‌లో దాక్కున్నట్లు తెలిసింది.

ఫన్-మాస్కింగ్‌లో

ఫన్-మాస్కింగ్‌లో

ఇక వ్యాపారవేత్త భరత్ ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసాడని, అతని ద్వారా, వారు రాత్రంతా అపార్ట్‌మెంట్లలో పార్టీ చేసుకున్నారని అంటున్నారు. ఇక వీరు ఫన్-మాస్కింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసిందని అంటున్నారు. నిజానికి నైజీరియా పౌరుడు, డ్రగ్స్ వ్యాపారి అయిన థామస్ తన విచారణలో ముఖ్యమైన సమాచారాన్ని అందించాడు. HRBR లేఅవుట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న థామస్ మీద దాడి సమయంలో రూ .15.50 లక్షల విలువైన 403 X'Tesi మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.

అందరు టచ్లోనే

అందరు టచ్లోనే

మరోవైపు, బెన్సన్ టౌన్‌లోని DJ వచన్ చిన్నప్ప ఇంటిపై పోలీసులు దాడి చేశారు. వచన్ చిన్నప్ప డ్రగ్ పెడ్లర్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని గుర్తించి పోలీసులు వచన్ చిన్నప్పను ఇంట్లో అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ పెడ్లర్ థామస్ అందించిన సమాచారం ఆధారంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి పద్మనాభం ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అలాగే భరత్ ఇంటిలో కూడా సమాచారం దొరకడంతో భరత్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనియా అగర్వాల్, వ్యాపారవేత్త భరత్ మరియు DJ వచోన్ చిన్నప్ప డ్రగ్ పెడ్లర్ థామస్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X