twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హోటల్ బిల్లు ఎగవేతపై పూజాగాంధీ.. జేడీ చక్రవర్తి సినిమా కోసం.. వివాదంలోకి రాజకీయ నేత

    |

    కన్నడ నటి, దండుపాళ్యం ఫేం పూజాగాంధీ‌పై బెంగళూరులోని హోటల్ యాజమాన్యం కేసు నమోదు చేయడం దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోటల్‌లో కొద్దికాలం ఉండి దాదాపు రూ.3.35 లక్షల మేరకు ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై పూజాగాంధీపై కేసు నమోదైంది. ఈ క్రమంలో తనపై నమోదైన కేసు గురించి, హోటల్ బిల్లు ఎగవేత గురించి పూజాగాంధీ వివరణ ఇచ్చారు. వాస్తవాల్లోకి వెళితే..

     రూ.3.35 లక్షలు చెల్లించలేదని

    రూ.3.35 లక్షలు చెల్లించలేదని

    నటి పూజాగాంధీ, ఆమె స్నేహితుడు, రాజకీయ వేత్త అనిల్ పీ మీనాసినకాయ్‌ ఇద్దరు కలిసి హోటల్‌లో ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 వరకు ఉన్నారు. ఆయా కాలంలో హోటల్ ఉన్నందుకు వారికి అయిన బిల్లు రూ.26,22,344. అయితే వారు ఏప్రిల్ 2016 నుంచి డిసెంబర్ 2018 వరకు రూ.22,83,129 లక్షలు చెల్లించారు. మిగితా రూ.3.35 లక్షలు చెల్లించకుండా వెళ్లిపోవడం ఈ వివాదానికి కారణమైంది.

    ఆయన బిల్లులకు సంబంధం లేదు

    ఆయన బిల్లులకు సంబంధం లేదు

    పూజాగాంధీ చెల్లించాల్సిన మిగితా డబ్బు కోసం పూజాగాంధీతో హోటల్ సెక్యూరిటీ మేనేజర్ సంప్రదింపులు జరిపారు. అయితే తాను సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. నా స్నేహితుడు మీనాసినకాయ్, ఆమె సిబ్బందికి సంబంధించిన హోటల్‌ బిల్లులకు తనకు సంబంధం లేదని పూజాగాంధీ చెప్పినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

    చెక్ బౌన్స్‌తో వివాదం మొదలై

    చెక్ బౌన్స్‌తో వివాదం మొదలై

    పూజాగాంధీతో చర్చించిన అనంతరం మీనాసినకాయ్‌తో హోటల్ సిబ్బంది బిల్లుల గురించి ఆరా తీశారు. అయితే తాను చెల్లించాల్సిన మొత్తానికి చెక్కు ఇవ్వగా అది బౌన్స్ కావడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. బ్యాంకు అకౌంట్‌లో తగిన నిధులు లేకుండా మీనాసినకాయ్ చెక్కు ఇచ్చారు. అది బౌన్స్ కావడం మా హోటల్‌ను చీట్ చేసినట్టు భావిస్తున్నాం. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేశారు.

    నాపై బోగస్ ఫిర్యాదు అని

    నాపై బోగస్ ఫిర్యాదు అని

    హోటల్ మేనేజర్ ఫిర్యాదు నేపథ్యంలో బెంగళూరు హై గ్రౌండ్ పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే అంతకుముందే మీనాసినకాయ్‌ అనుచరులు బిల్లులు చెల్లించి వివాదానికి ముగింపు పలికారు. ఆ లోపే మీడియాలో ఈ వివాదం రచ్చ కావడం జరిగింది. దాంతో తమపై తప్పుడు రీతిలో బోగస్ కంప్లయింట్ ఇచ్చారు అని పూజాగాంధీ మీడియాతో అన్నారు.

    నా బిల్లు అప్పుడే చెల్లించాను

    నా బిల్లు అప్పుడే చెల్లించాను

    హోటల్ బిల్లుల చెల్లింపు వివాదంపై పూజాగాంధీ స్పందిస్తూ.. నేను హోటల్‌లో బస చేసిన విషయం నిజమే. అది కూడా జేడీ చక్రవర్తి మూవీ షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు సందర్భంగా బస చేయడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లును నా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం జరిగింది. ఈ వివాదంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నాపై అసత్యపు వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి అని పూజాగాంధీ వెల్లడించింది.

    నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు

    నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు

    హోటల్ బిల్లుల వివాదంలో బోగస్ కేసు వెలుగులోకి రావడంతో హోటల్ మేనేజర్‌ను సంప్రదించాను. ఈ బిల్లుల వ్యవహారంలో తప్పుడు సమాచారం కారణంగా వివాదంగా నెలకొన్నది. రాజకీయ వేత్త మీనసినకాయ్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన హోటల్ బిల్లుల ఎగవేతకు నాకు సంబంధం లేదు. నా ప్రతిష్ఠకు భంగం కలిగించడానికే ఇదంతా జరిగింది అని పూజా గాంధీ ఆరోపించింది.

    English summary
    Pooja Gandhi said, "I stayed at the hotel for a while during the pre-production of JD Chakravarthy’s movie, and paid the service bill through my credit card. I know Menasinakai as he is a politician but I am nowhere connected with paying the bill of the hotel. It is a clear intention to tarnish my image,".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X