చిరంజీవికి సన్నిహితురాలు, ప్రముఖ నటికి కరోనా వైరస్

ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు సుమలత అంబరీష్‌ కరోనావైరస్ బారిన పడ్డారు. ఇటీవల కర్ణాటక నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె తనకు కోవిడ్ 19 బారిన పడటంతో మరో ప్రముఖ వ్యక్తి ఈ వ్యాధికి గురైన వారి జాబితాలో చేరారు. తనకు కరోనావ్యాధి సోకిందని స్వయంగా ఆమె మీడియాకు ఓ ప్రకటన, వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రకటనలో ఏం చెప్పారంటే..

Recommended Video

షాకింగ్.. MP Sumalatha Ambareesh కు COVID-19 పాజిటివ్! || Oneindia Telugu
దక్షిణాది సినీ పరిశ్రమలో

దక్షిణాది సినీ పరిశ్రమలో

ప్రముఖ నటి సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవికి సుమలత ఫ్యామిలీ అత్యంత సన్నిహితులు అనేది అందరికీ తెలిసిందే శుభలేఖ, ఖైదీ నుంచి పలు చిత్రాల్లో చిరంజీవితో కలిసి నటించారు. ఆయనతో చట్టంతోపోరాటం, వేట, గ్యాంగ్ లీడర్, వేట, పసివాడి ప్రాణం, రాక్షసుడు చిత్రాల్లో నటించారు. శృతిలయలు, జాకీ లాంటి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు.

కన్నడ నటుడు అంబరీష్‌తో వివాహం

కన్నడ నటుడు అంబరీష్‌తో వివాహం

పలు భాషల్లో బిజీగా ఉంటున్న సమయంలోనే ప్రముఖ కన్నడ నటుడు, రాజకీయ నేత అంబరీష్‌ను 1991లో వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి కన్నడ పరిశ్రమలోనే నటిస్తూ అక్కడి రాజకీయాలతో మమేకమయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్యా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తాజాగా తాను కరోనావైరస్ బారిన పడ్డారని వెల్లడించారు.

తల, గొంతు నొప్పితో బాధపడటంతో

తల, గొంతు నొప్పితో బాధపడటంతో

జూలై 4వ తేదీన నాకు తలనొప్పి, గొంతులో ఇరిటేషన్ కలిగింది. దాంతో ఏదో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకొంటే కోవిడ్ 19 పాజిటివ్ అని రోగ నిర్ధారణ పరీక్షల్లో తేలింది. కొద్ది రోజులుగా నా నియోజకవర్గంలో పలు పర్యటనలు చేశాను. ఆ సమయంలోనే నాకు కరోనావైరస్ సోకి ఉండవచ్చు అని సుమలత ఓ ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు

కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు

తాజాగా అందిన కరోనావైరస్ రిపోర్టులో కోవిడ్ లక్షణాలు అంతగా ప్రభావవంతంగా లేవు. ఇంట్లో ట్రీట్‌మెంట్ సరిపోతుందని వైద్యులు తెలిపారు. దాంతో నేను స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకొన్నాను. వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ జరుగుతున్నది అని సుమలత ట్వీట్ చేశారు.

కరోనాను ఎదురించి త్వరలోనే బయటకు

కరోనాను ఎదురించి త్వరలోనే బయటకు

భగవంతుడి దయ వల్ల నా రోగ నిరోధకశక్తి బలంగా ఉండటంతో నాకు, నా ఆరోగ్యానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు. త్వరలోనే కరోనా నుంచి బయటపడుతాననే నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వ అధికారులకు నా రిపోర్టులు, ఇతర వివరాలను అందజేశాను. నాతో ఎవరైనా కలిస్తే.. కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే, వెంటనే పరీక్షలు చేయించుకోండి అని సుమలత చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X