బర్త్ డే సందర్భంగా ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన.. .. పునిత్ రాజ్ కుమార్ పేరుతో సేవలు!
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మార్చి 26న తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే తన 58వ పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ కీలక ప్రకటన చేశారు. అయితే ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ పేరుతో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

మా ఎన్నికలలో కూడా
దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు గడించిన ప్రకాష్ రాజ్ సేవా కార్యక్రమాలతో కూడా తన మంచితనం చాటుకుంటున్నారు. రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉండే ఆయన గతంలో లోక్ సభ ఎన్నికలలో కూడా పోటీ చేశారు. ఆ తర్వాత అందులో ఓడి పోవడంతో మా ఎన్నికలలో కూడా అధ్యక్ష్య పదవికి పోటీ చేసి మంచు విష్ణు చేతులో ఓడిపోయారు.

లాక్‌డౌన్ సమయంలోనూ
అయితే తన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ముందు నుంచీ చేస్తూ వస్తున్నారు ప్రకాశ్ రాజ్. గతంలో కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ప్రకాశ్ రాజ్ పేదలకు సేవలు అందించారు. తన ఫామ్ హౌస్ లో వలస కూలీలకు ఆశ్రయం ఇచ్చి.. తన సొంత ఖర్చులతో వారి సొంత ప్రాంతాలకు కూడా పంపించాడు ప్రకాష్ రాజ్.

పుట్టినరోజు
ఇక మార్చ్ 26 విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ కీలక ప్రకటన కూడా చేయడం ఆసక్తికర ప్రకటన చేశారు. కన్నడ నటుడు దివంగత పునీత్ రాజ్‌కుమార్ పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. అంతే కాదు అప్పూ ఎక్స్‌ప్రెస్ పేరిట ఓ ఫొటో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ప్రజా సేవలో
కన్నడ నాట పునీత్ రాజ్ కుమార్ ను అప్పు అనే పేరుతొ పిలుస్తారు. గతంలో పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఆయన ఒక సినిమా చేయగా దానికి అప్పు అని పేరు పెట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాక ఆయనకు అదే పేరు స్థిరంగా ఉండి పోయింది. ఇక పునీత్ రాజ్‌కుమార్ కూడా ప్రజా సేవలో ముందుండేవారు. తాను ఉన్నా.. లేకున్నా.. తన సేవా కార్యక్రమాలు ఆగకూడదని కొన్ని కోట్లు ముందే ఫిక్స్ డిపాజిట్ కూడా చేసి ఉంచారు పునీత్ రాజ్ కుమార్.

ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా
ఇక తాజాగా ప్రకాష్ రాజ్ ఆయన పేరుతో కొత్త కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. 'నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందం ఉంది. పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకేళ్లబోతున్నాను. అని పేర్కొన్నారు. అయితే అది ఎలాంటి సేవ అనే విషయం మీద ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు త్వరలోనే దేనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. చూడాలి అదేమిటి అనేది.


Click it and Unblock the Notifications











