Prakash Raj Vs Sudeep: బీజేపీలోకి స్టార్ హీరో.. తెలివి లేనోడు కాదంటూ ప్రకాశ్ రాజ్ షాకింగ్ ట్వీట్
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. అక్కడ చిత్ర విచిత్రమైన ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లోకి గ్లామర్‌ను తీసుకు వచ్చేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే అధికార భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు కర్నాటకలోని స్టార్లతో సీక్రెట్‌గా మంతనాలు కూడా జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై నేరుగా రంగంలోకి దిగారు. బుధవారం ఆయన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైతో బెంగళూరులోని ఆయన నివాసంలో సమావేశం అయిన తర్వాత కిచ్చా సుదీప్ మీడియాతో మాట్లాడాడు. 'రాబోయే కర్నాటక సాధారణ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారికి నా మద్దతు తెలియజేసేందుకు వచ్చాను. ఇప్పుడు ఆయనను కలిసి ఇదే విషయాన్ని వివరించాను. ఇందుకోసం నేను చేయదగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చాను.

ఆయన నాకు గాడ్‌ఫాదర్ లాంటి వారు. బొమ్మైను నేను ముద్దుగా మామా అని పిలుచుకుంటాను. నాకు ఎన్నో సార్లు క్లిష్ట సమయాల్లో ఆయన అండగా నిలిచారు. ఆయనకు మద్దతు ఇస్తానంటే.. ఆయన సూచించిన వాళ్లందరికీ సపోర్ట్ చేస్తున్నానని అర్థం' అని చెప్పుకొచ్చాడు.
రాబోయే కర్నాటక ఎన్నికల్లో కిచ్చా సుదీప్.. బస్మరాజు బొమ్మై నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు, అవసరం అయితే ప్రచారానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ స్టార్ హీరో చేసిన ప్రకటన కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఈ క్రమంలోనే ఆయనకు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు మద్దతు తెలుపుతుండగా.. ప్రతిపక్షాల వాళ్లు మాత్రం కిచ్చా సుదీప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ స్టార్ హీరో నిర్ణయంపై తమ తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
కిచ్చా సుదీప్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడంపై తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'కిచ్చా సుదీప్ ప్రకటనతో నేను దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఎంతో బాధ పడ్డాను. నిరాశలో కూరుకుపోయిన బీజేపీ ఈ నకిలీ వార్తను వ్యాప్తి చేస్తుందని మొదట బలంగా నమ్మాను. సుదీప్ ఒకరి ఎరలో పడేంత తెలివి తక్కువ వ్యక్తి కాదు' అని ఊహించని విధంగా ట్వీట్ చేశారు. దీంతో సుదీప్ అభిమానులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఫలితంగా ఇది కర్నాటకలో హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











