Karnataka Results వైరల్‌గా ప్రకాశ్ రాజ్ ట్వీట్.. మోడీ నిజస్వరూపం అదే..ప్రధానిని అలా టార్గెట్ చేస్తూ!
బీజేపీపై విమర్శలు చేయడంలో ప్రకాశ్‌రాజ్ ముందు వెనుక ఆలోచించడనేది అందరికి తెలిసిందే. ప్రధాని మోడీని టార్గెట్ చేయడంలో ఈ విలక్షణ నటుడు రెండువైపుల పదను ఉన్న కత్తిలా వ్యవహరిస్తుంటాడు. కర్ణాటక ఎన్నికల్లో మోడీ ప్రచారంపై ప్రకాశ్ రాజ్ తాజా అస్త్రాన్ని సంధించాడు. మోడీ నియంత అంటూ ఎప్పుడూ టార్గెట్ చేసే హిట్లర్‌ను పోల్చుతూ ట్వీట్ చేశారు. తాజాగా మోడీని పోస్టు చేస్తూ ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మోడీ నిజస్వరూపం అంటూ ట్వీట్ చేశాడు. నెకెడ్ ఫైల్స్, కర్ణాటక స్టోరిలు ఇవే అంటూ కామెంట్ చేశాడు. కర్ణాటక రాజకీయాల్లో హిట్లర్ తరహా రాజకీయాలు మోడీ చేస్తున్నాడు. చక్రవర్తి వేసే డ్రస్సులు, ఆయన నిజస్వరూపం ఇదే అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ నిజస్వరూపం 13 తేదీన బట్టబయలు కాబోతున్నది. హిట్లర్ తరహా హావభావాలను మోడీ ప్రదర్శిస్తున్నాడు. ఏనాటికైనా హిట్లర్ అనుభవించిన ఫలితాన్ని మోదీ కూడా అనుభవించడం ఖాయం అని ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పాడు.
ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వన్‌సైడ్‌గా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ దిశగా ప్రయాణిస్తున్నది. బీజేపీ దారుణమైన ఓటమిని నమోదు చేస్తున్నది. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











