రజనీకాంత్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు.. అభినందనలు తెలిపిన ప్రధాని
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే సూపర్ స్టార్ గా ఇండియన్ సినిమాల్ హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సూపర్ స్టార్ కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డు వరించింది.దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అందించబన్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ కు అభిమానులతో పాటు అగ్ర నటీనటులు అలాగే రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా రజనీకాంత్ కు తన విషెస్ అందించారు. తరతరాలుగా గుర్తింపు పొందుతూ తన శ్రమతో ఇతరులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రజనీకాంత్ మంచి వ్యక్తిత్వాన్ని కలిగినవారు. తైలవాకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ మోదీ అభినందనలు తెలియజేశారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఇచ్చే ఈ పురస్కారం రజనీకాంత్ ను గత కొన్నేళ్లుగా ఊరిస్తోంది. ఆయనకు ఈ అవార్డ్ చాలా ఆలస్యంగా వచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమ స్థాయి పెరిగేలా గణనీయమైన సేవ చేసిన వారికి ఈ పురస్కారంతో గౌరవిస్తారు. ఇండియన్ సినిమా పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు.


Click it and Unblock the Notifications











