కన్నడ పరిశ్రమకు ప్రియా వారియర్.. ఫిబ్రవరి 14న..
ఒక్కసారి కన్నుగీటి ఓవర్‌నైట్‌లో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నడ, తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువకానున్నారు. ఆమె నటించిన ఓరు ఆధార్ లవ్ చిత్రం పలు భాషల్లోకి డబ్ కానున్నది. ఇప్పటికే తెలుగు హక్కులను నిర్మాత గురురాజ్ కొనుగోలు చేశారు. సుఖీభవ బ్యానర్‌పై ఫిబ్రవరి 14న లవర్స్ డే పేరుతో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈ చిత్రాన్ని కన్నడ భాషలోకి డబ్బింగ్ చేశారు. ఈ సినిమాకు కిరిక్ లవ్ స్టోరి అనే టైటిల్‌ను పెట్టారు. గతంలో కిరిక్ పార్టీ అనే పేరుతో వచ్చిన చిత్రం సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకొన్న విషయం గమనార్హం.

ఇప్పటివరకు కన్నడలో డబ్బింగ్ చిత్రాలకు అనుమతి లేదు. తొలిసారి ఈ చిత్రాన్ని మలయాళం నుంచి కన్నడలోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. శాండల్‌వుడ్ ఛాంబర్‌లో టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. జనవరి చివరివారంలో సెన్సార్ పనులు ప్రారంభించనున్నారు. కిరిక్ లవ్ స్టోరి పేరుతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు ఓమర్ లూలూ మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











