Just In
- 46 min ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 1 hr ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 1 hr ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 2 hrs ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- Sports
SRH vs RCB: ఔటైన అసహనం.. కుర్చీపై విరాట్ కోహ్లీ కోపం! వీడియో
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
- News
కరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్‌లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపు
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్ట్.. హీరో తనీష్‌కు నోటీసులు.. సినీ తారల్లో టెన్షన్!
సినీ తారలకు సంబంధమున్న డ్రగ్స్ వ్యవహారంలో కేసులో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి పంజా విసిరారు. గత ఆరు నెలలుగా సంచలనం రేపుతున్న ఈ కేసులో కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడను అరెస్ట్ చేయడం మరోసారి సెన్సేషన్‌గా మారింది. శంకర్ గౌడ అరెస్ట్‌తో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసు, కన్నడ సినీ తారలకు డగ్రస్ సంబంధాల గురించి వివారాల్లోకి వెళితే...

సంజన, రాగిణితోపాటు 25 మందిపై కేసు
కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసును శోధిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత కొద్ది నెలలుగా సినీ తారలను ప్రశ్నిస్తూ అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసులో సంజన గల్రానీ, రాగిణి ద్వివేది లాంటి తారలను అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసు మరింత ఝటిలంగా మారింది. ఈ కేసులో నలుగురు నైజీరియన్లతోపాటు 25 మంది ప్రముఖులపై కేసు బుక్ చేశారు.

నిర్మాత శంకర్ గౌడపై తీవ్ర ఆరోపణలు
సినీ తారల అరెస్ట్‌తో సంచలనంగా మారిన నేపథ్యంలో నిర్మాత శంకర్ గౌడపై అనేక ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులోని సంజయ్‌నగర్‌లోని తన నివాసంలో నిషేధిత మాదక ద్రవ్యాలతో సినీ తారలకు, ప్రముఖులకు పార్టీ ఇచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కొద్దికాలంగా శంకర్ గౌడను విచారించారు. విచారణలో డ్రగ్స్ డీలర్స్ అందించిన సమాచారంతో కొరడా ఝులిపించారు.

విచారణ తర్వాత శంకర్ గౌడ అరెస్ట్
డ్రగ్స్ కేసులో పలుమార్లు విచారించిన తర్వాత నిర్మాత శంకర్ గౌడను మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఆయనపై ఎన్‌డీపీఎస్ యాక్ట్‌తోపాటు మాదక ద్రవ్యాల వినియోగానికి ప్రేరేపణ, నేరపూరితమైన కుట్ర అంశాలపై కేసు బుక్ చేశారు. ఇప్పటికే

తనీష్, సినీ నటి తనీషా, బిగ్‌బాస్ సెలబ్రిటీకి నోటీసులు
కన్నడ డ్రగ్ రాకెట్ కేసులో శంకర గౌడతో సంబంధాలు ఉన్న నటి తనీషా, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మస్తాన్ చంద్రతోపాటు టాలీవుడ్ హీరో తనీష్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో తనీషా, మస్తాన్ ఇప్పటికే విచారించారు. ఈ కేసులో తనకు నోటీసులు అందిన విషయాన్ని హీరో తనీష్ ధృవీకరించారు. నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరయ్యారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.

డ్రగ్స్ కేసులో నోటీసులపై తనీష్ రియాక్షన్
డ్రగ్స్ కేసులో నోటీసుల నేపథ్యంలో ఇటీవల హీరో తనీష్ స్పందించారు. అవాస్తవ సమాచారంతో తనపై మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిలో వాస్తవాలు లేవని ఖండించారు. డ్రగ్స్ కేసులో నాకు వచ్చిన నోటీసులకు కారణం వేరు. శంకర గౌడ నిర్వహించిన పార్టీకి సంబంధించిన కొన్ని విషయాల గురించి వివరణ అడిగేందుకు నాకు నోటీసులు జారీ చేశారు. అంతేగానీ నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని తనీష్ స్పష్టం చేశారు.