పెళ్లి చేసుకొంటానని నమ్మించి.. నటిపై రెండేళ్లుగా రేప్.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

కన్నడ సినీ పరిశ్రమలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఓ మహిళను పెళ్లి చేసుకొంటానని మోసగించిన కేసు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమవుతున్నది. ఈ వ్యవహారంలో సదరు నిర్మాతపై నటి కేసు నమోదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

కన్నడ నిర్మాతపై ఆరోపణలపై

కన్నడ నిర్మాతపై ఆరోపణలపై

కన్నడ పరిశ్రమలో నిర్మాత హర్షవర్ణన్ పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవల విజన్ 2023 అనే చిత్రంలో నటించారు. అయితే తనను పెళ్లి చేసుకొంటానని నమ్మించి తనను మోసగించాడు. తనకు న్యాయం చేయాలి అని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసు స్టేషన్‌లో బాధిత నటి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుకు వెంటనే స్పందించిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.

రెండేళ్లుగా కోరికలు తీర్చుకొని..

రెండేళ్లుగా కోరికలు తీర్చుకొని..

బాధిత నటి ఫిర్యాదు చేసిన ప్రకారం... నిర్మాత హర్షవర్ణన్‌కు నాకు స్నేహం ఉండేది. ఆ స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొంటానని నాకు మాట ఇచ్చాడు. ఆ తర్వాత నాతో శారీరకంగా రెండేళ్లుగా కోరికలు తీర్చుకొన్నాడు. అయితే పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. పలుమార్లు పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చిన స్పందించలేదు. ఇక ఈ వ్యవహారంలో ఏం చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపారు.

బలమైన సాక్ష్యాలు ఉన్నాయంటూ నటి ఆరోపణలు

బలమైన సాక్ష్యాలు ఉన్నాయంటూ నటి ఆరోపణలు

నిర్మాత హర్షవర్ధన్‌తో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. ఆ బంధానికి సంబంధించిన ఆధారాలు, వాట్సప్ ఛాట్స్, ఫోటోలు, మా మధ్య జరిగిన వ్యవహారాలకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు, శారీరక బంధాన్ని తెలిపే కొన్ని ఫోటోలు ఉన్నాయి అని బాధిత నటి తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేశారు. దాంతో వాటిని ఫొరెన్సిక్ పరీక్షలకు పోలీసులు పంపించారు. అలాగే నిందితుడిని జుడిషియల్ కస్టడీకి తరలించారు.

విష్ణువర్ధన్‌పై నమోదైన కేసు ఇదే..

విష్ణువర్ధన్‌పై నమోదైన కేసు ఇదే..

కన్నడ నటి ఫిర్యాదు ఆధారంగా నిర్మాత హర్షవర్శన్‌పై ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు మోముందు చేశారు. ఐపీసీ సెక్షన్ 417 (చీటింగ్), 376 (రేప్), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానం, రెచ్చగొట్టడం) 506 (కుట్ర పూరితం) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారని కన్నడ టీవీ9 కథనాన్ని వెల్లడించింది. అయితే సదరు నిర్మాత మౌనం వహించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

Tollywood యాక్టర్లు జాగ్రత్తలు పాటిస్తూ ఎలా షూటింగ్ చేస్తున్నారో చూడండి..!!
మీటూ ఉద్యమం మరింత బలంగా

మీటూ ఉద్యమం మరింత బలంగా

గత కొద్దికాలంగా పలు సినిమా ఇండస్ట్రీలో మహిళలపై అత్యాచారాలు, మోసాల సంఘటనలు బయటకు వస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మీటూ ఉద్యమం బలంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో పలువురు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తనపై జరిగిన అఘాయిత్యాలను బయటపెడుతున్నారు. తాజాగా కన్నడ పరిశ్రమలో నటి తనకు అన్యాయం జరిగిందంటూ నిర్మాతపై కేసు నమోదు చేయడం చర్చనీయాంవమైంది. ఈ కేసు దర్యాప్తులో ఏం జరుగుందనేది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X