Ramya Death Rumour..రమ్య డెత్ రూమర్ వెనుక హస్తం అతడితే..మృతి వార్తతో తీవ్ర గందరగోళం..మాజీ ఎంపీ టీమ్ క్లారిటీ

కన్నడ సినీ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ రమ్య మరణవార్త దక్షిణాది మీడియాను, అభిమానులను కుదిపేసింది. గుండెపోటుతో మరణించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాలు, సినీ వర్గాలు ఒక్కసారి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ వార్త నిజం కావొద్దంటూ అభిమానులు భగవంతుడిని ప్రార్థించారు. అయితే రమ్య మరణ వార్త సంచలన రేపడంతో కర్ణాటక ప్రజలను షాక్ గురి చేసింది. అయితే ఆమె మరణ వార్త ఫేక్ అంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులు కొట్టిపడేయడంతో అభిమానులుకు ఊరట లభించింది. ఈ వార్త వైరల్ కావడం వెనుక అసలు కారణం ఏమిటంటే?

హీరోయిన్ రమ్య ప్రస్తుతం జెనీవా, ప్రాగ్‌లో పర్యటిస్తున్నారు. ఆమె స్నేహితురాలు చిత్ర సుబ్రమణ్యంతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. జెనీవాలో ఆమె నిద్రిస్తున్న సమయంలో భారత్‌లో రమ్య మరణ వార్త విస్తృతంగా ప్రచారమైంది. దాంతో ఆమె స్నేహితులు, సన్నిహితులు వెంటనే ఫోన్ చేసి రమ్యతో మాట్లాడారు. ఆమె క్షేమంగా ఉన్నారనే విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

Production Manager Sunaina clarity on Heroine Ramya death rumour

రమ్య మరణవార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ఫిల్మీబీట్, వన్ ఇండియా టీమ్ ఆమెకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడారు. రమ్య ప్రొడక్షన్‌లో కీలకంగా వ్యవహరించే సునైనా ఫిల్మీబీట్ ప్రతినిధి చేసిన ఫోన్ కాల్‌కు స్పందించారు. ఓ తమిళ పీఆర్వో చేసిన పని ఇది. హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన మరణవార్తను చూసి... పొరపాటున రమ్య స్పందన చనిపోయాడని ట్వీట్ పెట్టారు. ప్రస్తుత రమ్య క్షేమంగా ఉన్నారు. ఈ సౌకర్యానికి చింతిస్తున్నాం అని సునైనా క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే.

అయితే తన మరణవార్తను తెలుసుకొన్న రమ్య ప్రస్తుతం తన టీమ్‌తో మాట్లాడి తగిన విధంగా క్లారిటీ ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. ఆమె స్వయంగా ట్వీట్ చేయడం గానీ, లేదా వీడియో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. త్వరలోనే రమ్య వీడియోతో మీడియాకు వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Production Manager Sunaina clarity on Heroine Ramya death rumour

రమ్య విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి మాండ్య పార్లమెంట్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన అభి సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చారు. ఇటీవల ఆమె నటించిన హాస్టల్ హడుగరు బెకంగిడ్డరే (తెలుగులో బాయ్ హాస్టల్ చిత్రం)లో భారీ విజయం అందుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X