Puneeth Raj Kumar : చివరిగా గడిపింది ఎవరితోనో తెలుసా.. ఆ వ్యక్తి పునీత్ గురించి ఏమంటున్నారంటే?

కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. ఈరోజు మధ్యాహ్నానికి పునీత్ రాజ్‌కుమార్‌ మరణించిన వార్త బయటకు రావడంతో దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆయన పాత వీడియోలు, ఫొటోలతో ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

 'బజరంగీ-2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో

'బజరంగీ-2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో

పునీత్ రాజ్‌కుమార్ మృతితో ఆయన అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడూ ఫిట్ గా ఉండడానికి వర్కవుట్ చేయడానికి ఆసక్తి చూపే పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం పలువురిని కలిచివేసింది. ఆయన మొన్న 'బజరంగీ-2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన సోదరుడు, హీరో శివరాజ్ కుమార్ మరియు రాకింగ్ స్టార్ యష్ లతో కలిసి పాల్గొన్నారు.

వాకింగ్ చేశాడని

వాకింగ్ చేశాడని

ఆ సమయంలో అప్పుతో శివన్న స్టెప్పులేశారు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పునీత్ నిన్న కన్నడ సంగీత దర్శకుడు గురుకిరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఉదయం కూడా వాకింగ్ చేశాడని అంటున్నారు. ఉత్సాహభరితమైన మరో డే స్టార్ట్ చేయాలని చూస్తున్న పునీత్ రాజ్‌కుమార్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి ఈ మధ్యాహ్నం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

పుట్టినరోజు వేడుకలో

పుట్టినరోజు వేడుకలో

నిన్న (అక్టోబర్ 28) సాయంత్రం గురుకిరణ్ పుట్టినరోజు వేడుక జరిగింది. నిన్న జరిగిన గురుకిరణ్ పుట్టినరోజు వేడుకలో అప్పు కూడా పాల్గొన్నారు. గురుకిరణ్ పుట్టినరోజు వేడుకలకు పునీత్ రాజ్‌కుమార్ కూడా హాజరయ్యి ఉత్సాహ పరిచారు. పునీత్ రాజ్‌కుమార్ కొంత సేపు మాట్లాడారు కూడా. గురుకిరిణ్‌కి శుభాకాంక్షలు, తెలిపి ఇంటికి పయనం అయిన ఆయన మళ్ళీ బయటకు రాలేదు.

 కలిసి డిన్నర్ చేశాం

కలిసి డిన్నర్ చేశాం

ఈ మధ్యాహ్నం పునీత్ రాజ్‌కుమార్ లేరనే వార్త సంగీత దర్శకుడు గురుకిరిణ్‌కి కూడా షాక్ లా తగిలింది. "పునీత్ రాజ్‌కుమార్ నుండి నాకు చాలా మద్దతు ఉంది, మా ఇంటి ఫంక్షన్లకు ఎప్పుడు పిలిచినా వస్తుంటారు. నిన్న నా పుట్టిన రోజుకి ఇక్కడకు రావాలని కోరితే వచ్చారని, నిన్న మేము కలిసి డిన్నర్ చేసామని గురు కిరణ్ పేర్కొన్నారు.

అప్పు పర్ఫెక్ట్ గా ఉన్నారు

అప్పు పర్ఫెక్ట్ గా ఉన్నారు


ఆ సమయంలో అప్పు పర్ఫెక్ట్ గా ఉన్నారని, కేక్ కట్ చేసిన వెంటనే ఇంటికి చేరుకున్నాడు. నిన్న అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. ఇద్దరం బాగా మాట్లాడుకున్నాం. తర్వాత ఇంటికి వెళ్ళాడని, అలాంటి వ్యక్తి ఈ రోజు లేదంటే నమ్మాలని అనిపించడం లేదని, హృదయానికి గాయం అయినట్లు ఉందని ఆయన అన్నారు.

Recommended Video

Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
రెండు గంటలకు పైగా మాతో

రెండు గంటలకు పైగా మాతో

" నేను ప్రొఫెషనల్‌ కంటే పునీత్‌ రాజ్‌కుమార్‌తో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండేవాడిని. వారితో కలిసి వారి ప్రొడక్షన్‌లో పనిచేస్తున్నానని ఆయన అన్నారు. నేను అతని మొదటి సినిమాకు పనిచేశానన్న ఆయన. ఆయనతో కొన్ని సినిమాల్లో పని చేసే అవకాశం వచ్చింది. మేము ఇప్పుడు అప్పుని చాలా మిస్ అవుతున్నామని ఆయన అన్నారు. వారు చాలా సింపుల్‌గా ఉంటారన్న గురు కిరణ్. శివన్న, రాఘన్న(రాఘవేందర్ రాజ్ కుమార్), అప్పు(పునీత్ రాజ్ కుమార్)లకు ఎలాంటి గర్వం లేదని అన్నారు. నిన్న జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ లో పునీత్ రాజ్ కుమార్ రెండు గంటలకు పైగా మాతో ఉన్నారని ఆయన అన్నారు.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X