Puneet Rajkumar క్యూట్ లవ్ స్టోరి.. భార్య అశ్విని ఎవరు? ఇద్దరి లవ్ ట్రాక్, డేటింగ్ ఎలా మొదలైందంటే?
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ మూగబోయింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొంటూ ప్రతీ ఒక్కరు తన బాధను, విషాదాన్ని పంచుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టుడు దు:ఖంలో మునిగిపోయిన పునీత్ భార్య అశ్వినిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదనే విషయం కంటతడి పెట్టిస్తున్నది. అయితే పునీత్ రాజ్‌కుమార్, అశ్వినీ ప్రేమ వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు..

పునీత్ రాజ్‌కుమార్‌తో అశ్వినీ పరిచయం
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడిగానే కాకుండా పునీత్ రాజ్‌కుమార్ బాలనటుడిగా చిన్నతనంలో భారీగా పాపులారిటీ సంపాదించుకొన్నారు. బాల సూపర్ స్టార్‌గా క్రేజ్‌ను సంపాదించుకొంటున్న సమయంలోను, అలాగే తన చదువులను పూర్తి చేసుకొంటున్న క్రమంలో తన స్నేహితుల ద్వారా పునీత్‌కు అశ్విని పరిచయమైంది. అయితే వారిద్దరు పరిచయం చేసుకొన్నప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది వారి పునీత్, అశ్వినీ మధ్యలో లేదని స్నేహితులు చెప్పుకొంటారు.

పరిచయం ప్రేమగా మారింది ఇలా..
అయితే పలుమార్లు స్నేహితుల పార్టీల్లోను, ఇతర వేడుకల్లో పునీత్, అశ్వినీ రెగ్యులర్‌గా కలుసుకొనే వారు. అలా కలుకొన్న సమయంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకొంటూ మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్నగా డేటింగ్ చేస్తూ తాము ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనేంతగా ప్రేమలో ఉన్నామని తెలుసుకొన్నారు.

తండ్రి ఎదుటు నిలబడి ధైర్యంగా
అయితే తమ మధ్య ఉన్న ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత తండ్రి రాజ్‌కుమార్‌ను పునీత్, అశ్వినీ కలిశారు. అశ్వినీతో తన ప్రేమ విషయాన్ని నేరుగా తన తండ్రితో పునీత్ పంచుకొన్నారు. తండ్రి ఎదుట నిలబడి ఈ అమ్మాయి పేరు అశ్విని.. ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నానని చెప్పాను. అయితే ఈ విషయం మీ అమ్మకు చెప్పమని సూచించారు. ఆ తర్వాత మా తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నా పెళ్లి జరిగిపోయింది అని ఇటీవల పునీత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొన్నారు.

రాజ్‌కుమార్‌తో అశ్విని అనుబంధం
అశ్విని తన కుటుంబంలో ఎలా ఇమిడిపోయిందనే విషయాన్ని పునీత్ చెబుతూ.. మాది 30 మందితో కూడిన సమిష్టి కుటుంబం. తొలుత జాయింట్ ఫ్యామిలీలో ఉండటానికి అశ్విని ఇబ్బంది పడింది. కానీ మా ఇంటిలో అనుబంధాలు, ప్రేమానురాగాలను చూసి ఆమె మా కుటుంబంలో ఒక్కరిగా మారిపోయింది. మా నాన్నకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. వారాంతంలో మా నాన్న రాజ్‌కుమార్ ఇష్టపడే స్వీట్లను అశ్విని స్వయంగా చేసి పెట్టేది అని పునీత్ ఇటీవల వెల్లడించారు.

పదేళ్ల దాంపత్య జీవితంలో కలతలు..
ఇటీవల తమ పదేళ్ల దాంపత్య జీవితం గురించి అశ్విన్ చెబుతూ.. అందరి జీవితంలో మాదిరిగానే మా లైఫ్‌లో కూడా కలతలు, అలకలు ఉండేవి. కానీ అవి వెంటనే సర్దుకొనేలా ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యేవాళ్లం. తొలుత నాకు చాలా ఇగో ఉండేది. పునీత్ కారణంగా నేను అలాంటి వాటికి దూరంగా ఉండేలా మారిపోయాను. లెజెండ్ రాజ్ కుమార్ ఫ్యామిలీలో తాను భాగస్వామిని కావడం ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది అని అశ్వినీ చెప్పారు.

నా సినిమాలకు బెస్ట్ క్రిటిక్ అశ్విని
తన భార్య అశ్విని గురించి పునీత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నా సినిమాల గురించి కచ్చితమైన అభిప్రాయాలను చెప్పే క్రిటిక్. కొన్ని సన్నివేశాల్లో సరిగా చేయలేదని, ఆ సందర్భంలో డ్యాన్స్ బాగాలేదు. ఫైట్స్ మీ అభిమానుల అంచనాలకు తగినట్టుగా లేదు అని నిర్మోహమాటంగా చెప్పేది అని పునీత్ రాజ్‌కుమార్ చెప్పారు.
Recommended Video

పునీత్ రాజ్‌కుమార్ హీరోయిన్లతో అశ్విని
పునీత్ రాజ్‌కుమార్‌తో నటించిన అందరి హీరోయిన్లతో అశ్విని చాలా క్లోజ్‌గా ఉండేది. షూటింగ్‌కు వచ్చి వారితో ఆనందంగా సమయాన్ని గడిపేది. అశ్వినికి హీరోయిన్ల వల్ల ఎలాంటి అభద్రతాభావం ఉండేది కాదు. నా పలు సినిమాల ప్రొడక్షన్ వ్యవహారాల్లో చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొన్నారు. పునీత్‌కు సంబంధించిన క్యాస్ట్యూమ్స్‌ను అశ్వినీ సెలెక్ట్ చేసేది అని సన్నిహితులు పలు సందర్బాల్లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











