మరోసారి తీవ్ర విషాదంలో పునీత్ ఫాన్స్. 'జేమ్స్' సినిమా చూస్తూ అభిమాని మృతి.. ఏమైందంటే?

ఇటీవల పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే కేవలం పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారు అనే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. అయితే తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరో సినిమా చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఇండియా వైడ్‌గా

ఇండియా వైడ్‌గా

దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రమైన 'జేమ్స్' ఆయన జయంతి సందర్భంగా చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ చిత్రం 4 వేలకు పైగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో అప్పూ ఒక భద్రతాసంస్థలో మేనేజర్‌, సైన్యాధికారిగా రెండు పాత్రలు పోషించాడు. ప్రియా ఆనంద్‌ హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్ విలన్ గా నటించారు. ఈ సినిమాలోని ఫైట్స్ పునీత్ కంపోజ్ చేయగా తెలుగు వ్యక్తి కిషోర్ పత్తికొండ ఈ సినిమాను నిర్మించారు.

వారం రోజుల వరకు

వారం రోజుల వరకు

ఈ వీకెండ్ ఆదివారం వరకు కర్ణాటక లోని అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ వారం రోజులు ఇంకే సినిమా రిలీజ్ చేయకూడదు, అన్ని థియేటర్స్ లోను 'జేమ్స్' సినిమానే రిలీజ్ అవ్వాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల వరకు ఇతర సినిమాలు ఏవీ కర్ణాటకలో విడుదల చేయొద్దని కూడా కన్నడ పరిశ్రమ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

బాక్సాఫీస్ సత్తా

బాక్సాఫీస్ సత్తా

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి రోజునే ₹27.53 కోట్ల రూపాయల మేర భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాలో చిత్రం మూడవ రోజు థియేటర్లలో ₹9 కోట్లు వసూలు చేసింది. అయితే కర్ణాటకలోని ఒక చోట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైసూరు జిల్లా నంజనగూడు గ్రామానికి చెందిన ఆకాష్(22) కి పునీత్ అంటే ఎనలేని అభిమానం. ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తూ పెరిగాడు. ఇక ఇటీవల ఆయన మృతిని జీరించుకోలేకపోయాడు ఆకాష్.

Recommended Video

James Movie: Puneeth Rajkumar చివరి సినిమా Karnataka పునీత్ మయం| Appu Lives On | Filmibeat Telugu
తీవ్ర విషాదం

తీవ్ర విషాదం

తన హీరో చివరి చిత్రాన్ని చూడాలని స్నేహితులతో కలిసి థియేటర్ కి వెళ్ళాడు. వెండితెరపై పునీత్ ని చూడగానే ఎమోషనల్ అయ్యాడు. ఆయన లేడు అన్న విషయం తలుచుకుని బాధ పడుతూ ఆకాష్ కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్నవారు ఏమైంది అని చూసే లోపులోనే అతడు మృతిచెందినట్లు అతని స్నేహితులు వెల్లడించారు.

తన అభిమాన హీరోని వెండితెరపై చూస్తుండగానే తమ స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి అతని స్నేహితులు షాక్ లో ఉన్నారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆకాష్ కి గుండెపోటు రావడంతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X