twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #PuneethRajkumar భౌతిక దూరమైనా.. నేత్రదానంతో అమరుడైన పునీత్.. పవర్ స్టార్ చేసిన సామాజిక సేవలు ఇవే!

    |

    కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భౌతికంగా దూరమైనప్పటికీ ప్రజలు, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. కేవలం నటనతోనే కాకుండా తండ్రి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ అడుగు జాడల్లో నడుస్తూ ఎన్నో సామాజిక సేవల్లో నిమగ్నమయ్యారు. గుప్త దానాలు, స్వచ్చంద కార్యక్రమాలను ఎన్నో చేసినా ఆయన ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉండేవారనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అవేమిటంటే..

    45 స్కూల్స్, 16 వృద్దాశ్రమాలతో

    45 స్కూల్స్, 16 వృద్దాశ్రమాలతో


    కర్ఠాటక రాష్ట్రంలో పేద పిల్లల కోసం ఉచిత విద్యను అందించేందుకు పునీత్ రాజ్‌కుమార్ తన వంతు సహకారం అందించారు. 45 ఉచిత విద్యను అందించే స్కూల్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 26 అనాథ ఆశ్రమాలను నెలకోల్పారు. అంతేకాకుండా వృద్దుల కోసం 16 వృద్దాశ్రమాలను నెలకొల్పారు.

    1800 మందికి ఉచిత విద్య

    1800 మందికి ఉచిత విద్య

    పునీత్ రాజ్‌కుమార్ సమాజానికి సేవలు అంతటి ఆగిపోలేదు. కన్నడ రాష్ట్రంలో 19 గోశాలలు, 1800 మంది స్టూడెంట్స్‌కు ఉచిత విద్యను అందించారు. అంతేకాకుండా తన మరణాంతరం తన కళ్లను దానం చేశారు. నేత్రదానంతో మరోసారి ఆయన అమరుడయ్యాడు. మరో వ్యక్తి జీవితంతో ఈ ప్రపంచాన్ని చూడబోతున్నారు. తన జీవితంలో పునీత్ రాజ్‌కుమార్ చేసిన సేవలను అభిమానులు, సన్నిహితులు గొప్పగా చెప్పుకొంటున్నారు.

    విక్రమ్ హాస్పిటల్‌కు పోటెత్తిన అభిమానులు

    పునీత్ రాజ్‌కుమార్ హాస్పిటల్‌లో చేరారనే విషయం తెలియగానే విక్రమ్ హాస్పిటల్ వద్దకు భారీగా జనం పోటెత్తారు. ఆ ప్రాంతంలో వీధులన్నీ అభిమానుల రోదన, బాధ, ఆవేదనలు మిన్నంటాయి. దాంతో కన్నడ ప్రభుత్వం ఎలాంటి ఆవేశాలకు, భావోద్వేగాలకు గురికావొద్దని సూచించింది. కన్నడ మంత్రి బసవ రాజ్ ఎస్ బొమ్మై ఫ్యాన్స్‌ను ప్రత్యేకంగా కోరుతూ ప్రకటనను విడుదల చేశారు.

    సదాశివ నగర్‌లోని ఆయన ఇంటికి

    సదాశివ నగర్‌లోని ఆయన ఇంటికి

    ఇదిలా ఉండగా, పునీత్ రాజ్‌కుమార్ పార్తీవ దేహాన్ని విక్రమ్ హాస్పిటల్ నుంచి సదాశివనగర్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఆయన అభిమానులు చివరిచూపు కోసం అక్కడ ఉంచారు. అభిమానులు భారీగా తరలిరావడంతో పునీత్ భౌతికకాయాన్ని కంఠీరవ స్టేడియానికి తరలించారు. అభిమానులు ఆయనను భారీ సంఖ్యలో కడసారి దర్శించుకొంటున్నారు.

    Recommended Video

    Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
    పునీత్ రాజ్ కుమార్ సినీ కెరీర్.. పూరీ డైరెక్షన్‌లో హీరోగా

    పునీత్ రాజ్ కుమార్ సినీ కెరీర్.. పూరీ డైరెక్షన్‌లో హీరోగా

    పునీత్ రాజ్‌కుమార్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి రాజ్ కుమార్ నటించిన ప్రేమద కనికే అనే చిత్రంతో బాలనటుడిగా 1976లో కెరీర్‌ను ఆరంభించారు. 1989 వరకు బాలనటుడిగానే ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తెలుగులో తీసిన ఇడియెట్ చిత్రం రీమేక్‌తో అప్పు సినిమాతో హీరోగా మారారు.

    అప్పటి నుంచి ఆయన కన్నడ పవర్ స్టార్‌గా మారిపోయారు. అప్పు తర్వాత అభి, వీర కన్నడిగా, మౌర్య, ఆకాశ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరి సినిమా యువరత్న తెలుగులో కూడా రిలీజై మంచి విజయాన్ని అందుకొన్నది. ఆయన నటించిన జేమ్స్, ద్వైత చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.

    English summary
    Puneeth Rajkumar dies at 46 due to heart Attack. He donates eyes after death: Here are the social works done by Power Star
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X