స్వర్గంలో తండ్రితో పునీత్ రాజ్ కుమార్.. గుండె బరువయ్యేలా చేస్తున్న ఫోటో
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసులోనే గుండెపోటుతో మరణించడం ఏమిటి అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు.. అంతే కాకుండా ఆరోగ్య విషయంలో ఎంతగానో జాగ్రత్తలు పాటించే పునీత్ రాజ్ కుమార్ వర్కౌట్స్ కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటాడు. అలాంటి బలమైన వ్యక్తి మరణించాడు అని తెలియగానే అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే మరొక స్పెషల్ ఫోటో కూడా ప్రతి ఒక్కరి గుండెను బరువెక్కిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ అలాగే అతని తండ్రి స్వర్గంలో ఉన్నట్లుగా ఎడిట్ చేసిన ఆ ఫోటో చాలా అద్భుతంగా ఉంది అని నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మంచి మనసున్న హీరోగా
కన్నడ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు రాజ్ కుమార్ మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయనకు ఎంత స్టార్ డమ్ వచ్చినా కూడా అది అభిమానులు ఇచ్చిన ప్రేమ అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఇక ఆయన వారసుడిగా అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ కూడా మంచి విలువలు ఉన్న కథానాయకుడిగా కూడా కీర్తిని అందుకున్నాడు. కేవలం ఒక మంచి నటుడిగానే కాకుండా మంచి మనసున్న మానవత్వం గల మనిషిగా కూడా పునీత్ రాజ్ కుమార్ జనాల మనసులో బలంగా గుడి కట్టుకున్నాడు అనే చెప్పాలి.

అభిమానులంటే అంత ప్రేమ
పునీత్ రాజ్ కుమార్ మరణించాడు అని తెలియగానే కొంతమంది అభిమానులు కూడా ప్రాణాలు వదిలారు అంటే అతనిపై ఏ స్థాయిలో అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. పునీత్ రాజ్ కుమార్ అభిమానులను కేవలం ఒక సాధారణ జనాల మాదిరిగా ఎన్నడూ చూడలేదు. వారితో ఆయనకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎవరైనా అభిమానిని కలుసుకోవాలని అనుకుంటే మాత్రం పునీత్ రాజ్ కుమార్ వారికి ప్రత్యేకంగా భోజనం పెట్టించి మరి ఆప్యాయంగా మాట్లాడతాడు.

వారికి సహాయం చేస్తూ
పునీత్ రాజ్ కుమార్ సంపాదించిన దాంట్లో సగం జనాలకు మంచి చేయడం కోసమే ఉపయోగిస్తూ ఉంటాడు. కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ మంది పిల్లలను చదివిస్తున్న హీరోగా కూడా పునీత్ రాజ్ కుమార్ జనాల గుండెల్లో దేవుడిగా నిలిచాడు. వీలైనంతవరకు కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేసే విధంగా పునీత్ అండగా ఉంటాడు. పునీత్ రాజ్ కుమార్ అంత మంచి వాడు కాబట్టే ఇండస్ట్రీ లతో సంబంధంలేకుండా చాలా మంది హీరోలు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Recommended Video

గుండెను బరువెక్కిస్తున్న ఫొటో
ఇక పునీత్ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ కూడా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్వర్గంలో ఉన్నట్లు ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ కూడా అక్కడికి వెళ్లినట్లు కొన్ని ఎమోషనల్ పోస్టర్లు గుండెను బరువెక్కేలా చేస్తున్నాయి. తండ్రి స్వర్గంలో ఉండగా కొడుకు వెనకాల నుంచి వచ్చి అల్లరిగా కన్నుమూయడం ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నిజంగా ఇద్దరు మంచి మనసులన్న ఈ నటులు తప్పకుండా స్వర్గానికి వెళ్లి ఉంటారని అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు. అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.


Click it and Unblock the Notifications











