అశ్రునయనాలతో పునీత్ అంత్యక్రియలు పూర్తి.. భోరున ఏడుస్తూ నుదుటిన ముద్దు పెట్టిన సీఎం.. ఏకంగా 30 లక్షలమంది?

దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం కంఠీరవ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు వేలాది మంది అభిమానుల అశ్రునయనాలతో ముగిశాయి. పునీత్ తండ్రి, తల్లి సమాధుల పక్కనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈ అంత్యక్రియల సమయంలో ముఖ్యమంత్రి పునీత్ పార్థివ దేహాన్ని ముద్దాడడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

శనివారం సాయంత్రం

శనివారం సాయంత్రం

పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు మరియు శ్రేయోభిలాషులు నివాళులు అర్పించేందుకు వీలుగా త్రివర్ణ పతాకం చుట్టి ఈ తెల్లవారు జాము దాకా స్టేడియంలో ఉంచారు. పునీత్ కి అంతిమ నివాళులు అర్పించేందుకు వేలాది మంది అభిమానులు శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వద్దకు చేరుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పునీత్ కు నివాళులర్పించారు.

బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, అర్జున్ సర్జా, ప్రభుదేవా వంటి దక్షిణ భారత సినీ ప్రముఖులు కూడా నటుడికి నివాళులర్పించారు. పునీత్ కుటుంబం మరియు ప్రభుత్వం అమెరికాలో ఉన్న పునీత్ కుమార్తె బెంగళూరు చేరుకున్న తర్వాత శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలని ముందు అనుకున్నారు.

ఆదివారానికి వాయిదా

ఆదివారానికి వాయిదా

కానీ అనూహ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మాట్లాడుతూ, "పునీత్ కుమార్తె సాయంత్రం 6 గంటలకు నగరానికి చేరుకోవచ్చని, అప్పటికి కూడా పునీత్ ను చివరిసారి చూసేందుకు వచ్చిన వారు ఇంకా మిగిలే ఉంటారని, సాయంత్రం 6 గంటల తర్వాత చీకటి పడ్డాక కంఠీరవ స్టూడియోలో అంత్యక్రియలు చేయడం కష్టం కాబట్టి ఆదివారానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.

నుదుటి పై ముద్దు

నుదుటి పై ముద్దు

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ఉదయం కంఠీరవ స్టేడియంలో అంతిమ ఊరేగింపుకు ముందు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. ఆయనకు నివాళులు అర్పించే సమయంలో బొమ్మై భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ భౌతికకాయం ముందు చేతులు ముడుచుకుని, కన్నీటి పర్యంతమయ్యారు, వీడ్కోలు పలికే సమయంలో ప్యాయంగా అతని నుదుటి పై ముద్దు పెట్టుకున్నాడు.

30 లక్షల మంది

30 లక్షల మంది

పునీత్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియం నుండి ఊరేగింపుగా తీసుకు వచ్చారు, ఊరేగింపు 5 గంటలకు ప్రారంభమై 16 కిలోమీటర్ల మేర సాగి కంఠీరవ స్టూడియోస్‌కు చేరుకుంది. దారిలో రోడ్లకు ఇరువైపులా గుమిగూడిన అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయనకు దాదాపు 30 లక్షల మంది ప్రజలు నివాళులర్పించారని అంచనా.

ఈడిగ సంఘం సంప్రదాయాల ప్రకారం

ఈడిగ సంఘం సంప్రదాయాల ప్రకారం

అలా ఎట్టకేలకు కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 46 ఏళ్ల నటుడిని మే 2017లో మరణించిన అతని తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ సమాధి పక్కనే ఖననం చేశారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అన్ని రాజకీయ పార్టీలు, అధికార, ప్రతిపక్ష నేతల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ మతానికి చెందిన ఈడిగ సంఘం సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు

మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు

తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్ సమాధుల పక్కనే పునీత్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పునీత్ రాజ్‌కుమార్‌కు కుమారులు లేనందున పునీత్ అంత్యక్రియలను ఆయన అన్న కొడుకు విన‌య్ రాజ్‌కుమార్ చేశారు. వేల మంది అభిమానుల మధ్య పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు సంప్రదాయ పద్ధతిలో, పోలీసుల గౌరవ వందనంతో జరిగాయి. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.

Recommended Video

Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
ధన్యవాదాలు

ధన్యవాదాలు

ఇక నటుడు రవిచంద్రన్, సుదీప్, యష్, నటుడు రిషబ్ శెట్టి, టెన్నిస్ కృష్ణ, నటి, శ్రీజన్ లోకేష్, ఎంపీ సుమలత, యోగితో పాటు పలువురు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించినందుకు కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రభుత్వానికి, పోలీసులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పునీత్ అన్న శివరాజ్‌కుమార్ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కృతజ్ఞతలు తెలిపారు. అందుకు సహకరించిన ప్రభుత్వానికి, అన్ని శాఖలకు, పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X