Puneeth అంత్యక్రియలు వాయిదా.. కీలక ప్రకటన చేసిన సీఎం.. అందుకే వాయిదా వేశామంటూ!
కన్నడ సినీ నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని ముందు ప్రకటించారు కానీ ఆయన అంత్యక్రియలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. అసలు పునీత్ అంత్యక్రియలు ఎందుకు వాయిదా పడ్డాయి? అనే వివరాల్లోకి వెళితే

భారీ ఎత్తున ట్రాఫిక్ జాం
కంఠీరవ స్టేడియం వద్ద అభిమానుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. మహాత్మాగాంధీ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కస్తూర్బా రోడ్డు, విట్టల్ మాల్యా రోడ్డులో ట్రాఫిక్ భారీగా జాం అయింది. సున్నిత ప్రాంతాల్లోని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. అయితే మెజారిటీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు యథావిధిగా పనిచేస్తున్నాయి. విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడతారనే భయంతో కాలేజీలు, యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేసుకున్నాయి.

భారీ భద్రత
అంతిమ నివాళులర్పించేందుకు వేలాది మంది తరలివచ్చిన కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 6000 మందికి పైగా పోలీసులు మోహరించారు. నగరం అంతటా భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని అధికారులు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
KSRP, CAR మరియు RAF సహా 50 ప్లటూన్ల రిజర్వ్ పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు నగరంలోని ప్రతి డివిజన్‌కు డీసీపీ స్థాయి సీనియర్ అధికారిని నియమించారు.

గౌరవప్రదంగా వీడ్కోలు పలుకుదాం
నివారణ చర్యగా నిన్నటి నుంచి 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కమిషనర్ కమల్ పంత్ శ్మశానవాటికను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పునీత్ రాజ్‌కుమార్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు చెప్పాలని పునీత్ రాజ్‌కుమార్ అభిమానులను కోరుతూ హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం అంత్యక్రియల స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.

ఈరోజే నిర్వహించాలని భావించారు కానీ
అంతకుముందు రోజు, విదేశాలలో చదువుతున్న నటుడి కుమార్తె బెంగళూరు నగరానికి చేరుకున్న తర్వాత శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని పలువురు మంత్రులు చెప్పారు. అయితే అంతిమ నివాళులు అర్పించేందుకు కంఠీరవ స్టేడియంకు ఇప్పటికీ వేలాది మంది అభిమానులు తరలి వస్తూనే ఉండడంతో, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందరూ చూడాలనే ఉద్దేశ్యంతోనే
నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అప్పు అభిమానులందరికీ నివాళులు అర్పించే అవకాశం కల్పించే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతితో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అన్నారు. చీకటి పడిన తర్వాత కంఠీరవ స్టేడియంలో అంత్యక్రియలు నిర్వహించడం కూడా సవాలేనని అన్నారు. పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె న్యూఢిల్లీ చేరుకుందని, బెంగళూరు కూడా కాసేపట్లో చేరుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

కుమార్తెలే కావడంతో అలా
అయితే పునీత్ రాజ్ కుమార్ అన్న రాఘవేంద్ర కొడుకు వినయ్ రాజ్ కుమార్‌తో పునీత్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.. పునీత్‌కు ఇద్దరు కూతుళ్లే కావడంతో కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్ కుమార్ కు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


Click it and Unblock the Notifications











