For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  James OTT: పునీత్ చివరి సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే!

  |

  కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి పరిచయమై.. చిన్న వయసులోనే తన టాలెంట్లను నిరూపించుకుని జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్నారు శాండిల్‌వుడ్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఆ తర్వాత హీరోగా మారిన ఆయన.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. దీంతో స్టార్‌డమ్‌ను దక్కించుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌కు కూడా భారీగా పెంచుకున్నారు. ఇలా కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న పునీత్ రాజ్‌కుమార్ కొద్ది రోజుల క్రితమే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

  బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!

  చాలా కాలం పాటు కన్నడ ప్రేక్షకులను తన చిత్రాలతో అలరించిన పునీత్ రాజ్‌కుమార్ కొద్ది రోజుల క్రితమే మరణించారు. దీంతో కర్నాటక ప్రేక్షకులు, ఆయన అభిమానులు భారీ లోటును ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పునీత్ నటించిన చిత్రం 'జేమ్స్'‌ను ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై కన్నడ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల సినీ అభిమానులు మక్కువ చూపించారు. తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఘనమైన నివాళిని అందించాలన్న ఉద్దేశంతో దీనికి భారీ స్థాయిలో స్పందనను కూడా అందించారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా 'జేమ్స్'కు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీనికి అనుగుణంగానే రివ్యూలు కూడా పాజిటివ్‌గా దక్కాయి. దీంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇలా ఈ సినిమా విడుదలైన అన్ని భాషలూ, ప్రాంతాల్లో మంచి స్పందనతో వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఇప్పటి వరకూ ఈ సినిమాకు రూ. 65 కోట్లకు పైగా షేర్‌తో పాటు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కూడా దక్కింది. కర్నాటకలోని చాలా ఏరియాల్లో ఇప్పటికీ హౌస్‌ ఫుల్ బోర్డులతో ఈ సినిమా ప్రదర్శన అవుతోంది.

  Samantha: ఇన్‌స్టాగ్రామ్‌‌తో సమంత లక్షల సంపాదన.. ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే!

  Puneeth Rajkumar James Movie on Sony Liv From April 14th

  థియేటర్లలో సందడి చేస్తోన్న దిగ్గజ నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' ఓటీటీ రిలీజ్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సోనీ లివ్ సంస్థ దీన్ని రిలీజ్ చేయబోతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీ నుంచి సదరు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. ఒక్క కన్నడ భాషలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ అలాగే మళయాళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.

  క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'జేమ్స్' మూవీ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా చేతన్ కుమార్ తెరకెక్కించారు. ప్రియా ఆనంద్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ దీన్ని నిర్మించారు. ఇందులో తెలుగు నటుడు శ్రీకాంత్ కూడా కీలక పాత్రను చేశాడు. చరణ్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక, ఈ మూవీలో పునీత్ పాత్రకు అన్న శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పునీత్‌కు ఘన నివాళి దక్కినట్లైంది.

  English summary
  Puneeth Rajkumar Last Movie Directed By Chethan Kumar. This Movie Will Stram on Sony Liv From April 14th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X