కర్ణాటకలో హై అలెర్ట్.. పునీత్ రాజ్ కుమార్ కోసం తరలి వస్తున్న స్టార్ సెలబ్రిటీలు
కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదా ను అందుకున్న సీనియర్ నటుడు రాజ్ కుమార్ గుండెపోటుతో ఆస్పత్రి పాలవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సన్నిహితులు బెంగళూరులోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే మొదట ఆయన ఆరోగ్యం నిలకడగానే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియా లో మరికొన్ని రూమర్స్ వైరల్ అవ్వడంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం హై హై అలర్ట్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

హాస్పిటల్ కు స్టార్ సెలబ్రెటీలు
పునీత్ రాజ్ కుమార్ కు ఏం జరిగిందో అని విక్రమ్ హాస్పిటల్ కు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా చేరుకుంటున్నారు.ఆసుపత్రిలో పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్, యష్, సీఎం బసవరాజ బొమ్మై నటి శృతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా గుండెపోటు రావడం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మొదట ఈ వార్తలన్నీ కూడా అబద్ధం అని అనుకున్నారు కానీ కొంత మంది సినీ ప్రముఖులు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో నమ్మక తప్పలేదు.

కర్ణాటక హై అలెర్ట్
అయితే అందరూ ఆందోళన చెందుతున్న క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. బెంగుూరులోని విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది శాండిల్‌వుడ్ సినీ ప్రముఖులు కూడా విక్రమ్ హాస్పిటల్ కు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా థియేటర్లు కూడా మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
3గంటల తరువాత
ఇక వైద్యులు పునీత్ ఆరోగ్యంపై ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేము అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం 3గంటల అనంతరం వివరణ ఇచ్చే అవకాశం ఉందట. సమాచారం. ఇక పునీత్ రాజ్ కుమార్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు చాలామంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.
Recommended Video

తెలుగు వాళ్ళతో మంచి స్నేహం
అయితే పునీత్ రాజ్ కుమార్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు చాలా మంది సినీ తారలు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సినిమాలను డబ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆయనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు ముఖ్యంగా టాలీవుడ్ తెలుగు హీరోలతో చాలా స్నేహంగా ఉంటాడు.
ఎన్టీఆర్ తో కూడా ఆయనకు మంచి స్నేహం ఉంది. ఆంధ్రవాలా సినిమాను పునీత్ రాజ్ కుమార్ కన్నడలో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ తో కూడా ఇడియట్ సినిమాను కన్నడలో చేశాడు.
ఇక సీనియర్ కన్నడ హీరో రాజ్ కుమార్ తనయుడు అయినటువంటి పునీత్ రాజ్ అతి తక్కువ కాలంలోనే కన్నడలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.


Click it and Unblock the Notifications











