For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Puneeth Rajkumar: మరణం నుంచి తప్పించుకున్న అన్న.. విషాదాన్ని నింపిన పునీత్.. ఒకే ఫ్యామిలీలో ఇలా!

  |

  కరోనా మహమ్మారి కారణంగా కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది సినీ ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. అలాగే, ఇతర కారణాలతో ఈ మధ్య కాలంలోనే పెద్ద పెద్ద స్టార్లు కూడా కన్నుమూశారు. దీంతో తరచూ ఏదో ఒక ఇండస్ట్రీలో విషాదకర సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో సినీ కుటుంబం ఎంతో మందిని కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ చిత్రసీమలో అత్యంత పెను విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా కన్నడంలో సత్తా చాటుతూ దూసుకుపోతోన్న పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించాడు. దీంతో రాజ్‌కుమార్ ఫ్యామిలీలో మరో దారుణం జరిగినట్లైంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో జరిగిన విషాదాల గురించి ప్రత్యేక కథనం!

  గుండెపోటుతో పునీత్ కన్నుమూత

  గుండెపోటుతో పునీత్ కన్నుమూత

  శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్లు చేసే సమయంలో గుండెపోటుకు గురయ్యాడు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. దీంతో అతడిని అక్కడి సిబ్బంది బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. కానీ, అవేమీ ఫలించకపోవడంతో పునీత్ రాజ్‌కుమార్ ఆ వెంటనే తుది శ్వాస విడిచాడు.

  Puneeth Rajkumar: బాలకృష్ణకు పునీత్ సహాయం.. స్టార్ అయినా ఆయన కోసం చిన్న పిల్లాడిలా.. వీడియో వైరల్

  విషాదంతో సినీ ప్రముఖుల పోస్టు

  విషాదంతో సినీ ప్రముఖుల పోస్టు

  పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలు అన్నింట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో దక్షిణాదికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు.. మిగిలిన పరిశ్రమల వాళ్లు కూడా పునీత్‌కు సంతాపం తెలుపుతున్నారు. తమ గుండె ముక్కలైందని చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అలాగే, అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు.

   తట్టుకోని ఫ్యాన్స్.. షాక్‌లో మరణం

  తట్టుకోని ఫ్యాన్స్.. షాక్‌లో మరణం

  సుదీర్ఘ కాలంగా కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తను ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆయన అభిమానులు గుండెలదిరేలా రోదిస్తున్నారు. విక్రమ్ ఆస్పత్రి దగ్గర నిన్న కనిపించిన దృశ్యాలు ఘోరంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పునీత్ చనిపోయినట్లు తెలియగానే ఓ ఫ్యాన్ మరణించాడు.

  Bigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణం

   పునీత్ మరణానికి కారణం ఇదేనా

  పునీత్ మరణానికి కారణం ఇదేనా

  పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన తర్వాత ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు జిమ్‌లో ఎక్కువగా వర్కౌట్లు చేయడం వల్లే గుండెపోటుకు గురయ్యాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా వైద్యులు, జిమ్‌లో ట్రైనింగ్ ఇచ్చే నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన వర్కౌట్లు కూడా ప్రాణాలు తీస్తాయని చెబుతున్నారు.

  రాజ్‌కుమార్ ఫ్యామిలీకి గుండెపోటు

  రాజ్‌కుమార్ ఫ్యామిలీకి గుండెపోటు

  పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో జరిగిన విషాదాలు గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ సైతం గుండెపోటు వల్లే మరణించారు. అప్పుడాయన వయసు 77 సంవత్సరాలు. వృద్దాప్యంలో పలు ఆరోగ్య సమస్యల వల్ల ఆయనకు గుండెపోటు వచ్చి కన్నుమూశారు. ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూ అయింది.

  Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!

   మరణం దాకా వెళ్లిన పునీత్ అన్న

  మరణం దాకా వెళ్లిన పునీత్ అన్న

  రాజ్‌కుమార్ తర్వాత ఆయన కుమారుడు స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌కు 54 ఏళ్ల వయసులో జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తుండగా ఆకస్మాత్తుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. దీంతో ఆయనను వెంటనే బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో శివ రాజ్‌కుమార్‌కు వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి ఆయన పెద్దగా వర్కౌట్లు చేయడం లేదు.

  Recommended Video

  Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు
  శివకు తప్పింది.. పునీత్‌ను మాత్రం

  శివకు తప్పింది.. పునీత్‌ను మాత్రం

  శివ రాజ్‌కుమార్‌కు సకాలంలో వైద్యం అందడం వల్ల మరణం తప్పింది. అయితే, పునీత్‌కు మాత్రం ఆలస్యం జరగడం వల్లే ప్రాణాపాయం సంభవించిందని తెలుస్తోంది. ముందుగా అతడిని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స అవసరం అని తెలిపారట. దీంతో విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పునీత్ ప్రాణాలు కోల్పోయాడని అంటున్నారు.

  English summary
  Puneeth Rajkumar Dies At The Age Of 46 At Vikram Hospital Bengaluru Due to Heart Attack. Let we Know Heart Attack Disaster in Rajkumar Family
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X