twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneethది హార్ట్ ఎటాక్ కాదు.. అసలు జరిగింది ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన పునీత్ ఫ్యామిలీ డాక్టర్!

    |

    కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అనూహ్యంగా జరిగి పోయింది. ఆయన అస్వస్థతతో హాస్పిటల్లో చేరినట్లు వార్తలు బయటకు రాగా అది జరిగిన కొద్ది సేపటికే కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించడంతో పాటు స్కూలు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం బయటకు రాగానే ఆయనకు ఏదో జరగరానిది జరిగిందనే విషయం అభిమానులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా తెలిసి పోయింది. అయితే అసలు ఆయన గుండెపోటు కారణంగా మరణించ లేదు అనే విషయాన్ని వెల్లడించారు పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ డాక్టర్. అయితే అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.

    మీడియాతో మాట్లాడిన డాక్టర్

    మీడియాతో మాట్లాడిన డాక్టర్


    తాజాగా పునీత్ రాజ్ కుమార్ మరణం గురించి రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ గా పనిచేస్తున్న రామారావు కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. పునీత్ మరణంపై రాజ్ కుమార్ ఫ్యామిలీ డాక్టర్ మీడియాతో మాట్లాడారు. మామూలుగా పునీత్‌ ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేవారనీ, ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణాలు చెప్పడం అసాధ్యమని రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ వైద్యుడు రమణరావు తాజాగా పేర్కొన్నారు.

    అసలు శుక్రవారం ఏం జరిగింది అంటే?

    అసలు శుక్రవారం ఏం జరిగింది అంటే?


    శుక్రవారం పునీత్‌ తన వద్దకు ఎలా వచ్చారో.. అక్కడ ఏం జరిగిందో రమణరావు వెల్లడించారు. ఓ మీడియా సంస్థతో రమణరావు మాట్లాడుతూ.. 'నలతగా ఉందంటూ భార్య అశ్వినితో కలిసి పునీత్‌ నా హాస్పిటల్ కి వచ్చి సంప్రదించారనీ, అసలు ఎంతో ఆరోగ్యంగా ఉండే పునీత్ నుంచి ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదన్న ఆయన, వెంటనే పలు పరీక్షలు చేశాననీ, ఆ సమయంలో ఆయన బీపీ సాధారణంగానే ఉందన్నారు. ఇక గుండె స్థిరంగా కొట్టుకుందనీ, ఊపిరితిత్తుల్లోనూ ఎలాంటి సమస్యా లేదనీ అన్నారు.

    ఐదారు నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ!

    ఐదారు నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ!

    అయితే తమ దగ్గరకు వచ్చే సమయానికి చెమటలు కారిపోతున్నాయన్న ఆయన జిమ్ చేసిన తర్వాత ఇది సాధారణమేనని రమణరావు చెప్పారు. ఎందుకైనా మంచిదని ఈసీజీ పరీక్ష చేస్తే అందులో ఓ స్ట్రెయిన్‌ కనిపించిందని అందుకే అన్ని సౌకర్యాలు ఉన్న విక్రమ్‌ ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లాలని అశ్వినికి సూచించానన్నారు. వారు కారు ఎక్కగానే విక్రమ్‌ ఆసుపత్రికి కాల్‌ చేసి ఐసీయూ సిద్ధం చేయాలని సూచించానన్న ఆయన. ఐదారు నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ఆయనను బతికించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

    గుండెపోటు కాదది!

    గుండెపోటు కాదది!

    ఇక ఆరోగ్యం పట్ల పునీత్ ఎంతో శ్రద్ధ వహించేవారన్న రమణరావు, నేనే పునీత్‌ను చూసి నేర్చుకోవాలని ఎంతో మందికి సలహాలు ఇచ్చేవాడినని అన్నారు. ఇక ఇదో హఠాత్పరిణామం అని పేర్కొన్న ఆయన ఇది గుండెపోటు(గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం) కాదు అని, కార్డియాక్ అరెస్ట్ (గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం) అని అన్నారు. ఇక ఈ కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయన్న రమణరావు పునీత్ విషయంలో మాత్రం అలాంటి ఒక్క కారణం కూడా కనిపించలేదన్నారు. ఇక ఆయనకు డయాబెటిస్, అసాధారణ బ్లడ్ ప్రెజర్ కూడా లేవని, పునీత్ విషయంలో ఏం జరిగిందో కచ్చితంగా చెప్పడం అసాధ్యం అని చెప్పుకొచ్చాడు.

    ఆదివారం అంత్యక్రియలు

    ఆదివారం అంత్యక్రియలు

    ఇక పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం నాడు జరగబోతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ అభిమానులు అందరూ ఆయనను కడసారి చూసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒకరోజు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పునీత్ రాజ్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు కావడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు పునీత్ రాజ్ కుమార్ కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ పెద్దకుమార్తె చదువుల నిమిత్తం విదేశాల్లో ఉండగా ఆమె తండ్రి మరణవార్త తెలుసుకుని బెంగళూరు చేరుకున్నారు.

    English summary
    Puneeth Rajkumar's Doctor Ramana rao crucial comments on heart attack.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X