పునీత్ రాజ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'గంధద గుడి' టీజర్ రిలీజ్.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యష్!

ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తుండగా ఆయన మృతి చెందారు. అయితే ఆయన డ్రీమ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

‘గంధద గుడి' డాక్యుమెంటరీ

‘గంధద గుడి' డాక్యుమెంటరీ

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'గంధద గుడి' డాక్యుమెంటరీ. అయితే ఈ రోజు పునీత్ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా.. పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్‌‌కుమార్‌తో కలిసి 'కేజీఎఫ్' స్టార్ యష్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్‌లో దర్శకుడు, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అమోఘవర్ష జెఎస్‌తో కలిసి అరణ్యంలో పునీత్ సాహస యాత్రను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

ధన్యవాదాలు అప్పు సర్

ధన్యవాదాలు అప్పు సర్

అయితే ఈ టీజర్‌లో పునీత్ తన చిరునవ్వులో కనిపించడంతో అభిమానులను భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ ఖాతాలో ఈ టీజర్ ను పోస్ట్ చేసిన యష్.. 'మీరు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన ప్రతీసారి మీ కళ్లలో కనిపించిన మెరుపు నాకు గుర్తుంది. ఈ సినిమా పట్ల మీకున్న అభిరుచి, ఉత్సాహం మీ హృదయానికి ఎంత దగ్గరగా ఉందో అర్థమైంది. మా 'గంధద గుడి'ని మీ కళ్లతో చూపించినందుకు ధన్యవాదాలు అప్పు సర్. ఇది నిజంగా స్వర్గం' అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు.

పునీత్ సాహస యాత్ర

పునీత్ సాహస యాత్ర

దర్శకుడు, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అమోఘవర్ష జెఎస్‌తో కలిసి అరణ్యంలో పునీత్ సాహస యాత్రను PRK ప్రొడక్షన్స్, మడ్‌స్కిప్పర్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్ నిర్మాతలుగా వ్యవహారంగా ఈ సినిమా 2022లో థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.

పరామర్శించిన పెద్దిరెడ్డి

పరామర్శించిన పెద్దిరెడ్డి

నిన్న ఉదయం బెంగుళూరు కు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని పరామర్శించారు. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చాలా బాధించింది అని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.

Recommended Video

Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
గుర్తు చేసిన డేవిడ్ వార్నర్

గుర్తు చేసిన డేవిడ్ వార్నర్

ఇక కన్నడ పవర్‌స్టార్‌, దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ ను ఇమిటేట్ చేసి మరొకమారు ఆయనను అందరికీ గుర్తు చేశాడు డేవిడ్ వార్నర్. పునీత్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ అయిన అప్పు సినిమాలోని ఒక సీన్‌ ను ఫేస్‌యాప్‌ సాయంతో రీక్రియేట్‌ చేసిన రీల్‌ ను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు ఆయన అలాగే దీనికి 'రెస్పెక్ట్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ ను కూడా జోడించాడు.ఈ క్రమంలోనే ఇప్పుడు పునీత్‌ ను గుర్తు చేస్తూ అతను షేర్‌ చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆయన అభిమానులు అయితే వీడియో వైరల్ చేస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X