ఉమెన్స్ డే రోజు భార్య కోసం 5 కోట్లు ఖర్చు.. స్టార్ హీరో ఏంచేశాడో తెలుసా!
మార్చి 8న దేశ వ్యాప్తంగా మహిళాదినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది మహిళా దినోత్సవ వేడుకల్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. మహిళా శక్తిని, ఔనత్యాన్ని తెలియజేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెట్టారు. భారతదేశంలో స్త్రీలని గౌరవించాలనే సాంప్రదాయం ఉంది. కానీ కొన్ని విషయాలలో ఇప్పటికి స్త్రీలకు సమాన అవకాశాలు దక్కడం లేదనే వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 2019 ఉమెన్స్ డేని తన భార్యకు ఎప్పటికీ గుర్తుండేలా చేశాడు.

రీమేక్ చిత్రాలతో
పునీత్ రాజ్ కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో. పలు తెలుగు రీమేక్ చిత్రాలతో పునీత్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దూకుడు లాంటి చిత్రాల కన్నడ రీమేక్ లో పునీత్ నటించాడు. కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ తనయుడిగా పునీత్ రాజ్ కుమార్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. కానీ తన ప్రతిభతో తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగాడు.

కానుకలు సహజమే
స్టార్ హీరోలు వారి సతీమణుల పుట్టినరోజుకు, పెళ్లి రోజు లాంటి సందర్భాల్లో కానుకలు ఇవ్వడం సహజమే. భార్యలకు ప్రాముఖ్యతనిచే హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో పునీత్ ఒకరు. భార్యకు పునీత్ ఉమెన్స్ డే రోజు ఏకంగా 5 కోట్లు ఖర్చు చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సందర్భం వచ్చినప్పుడల్లా పునీత్ తన సతీమణికి ఎదో ఒక విలువైన బహుమతి ఇస్తుంటాడట.

ఖరీదైన కారు
పునీత్ ఉమెన్స్ డే రోజు 5 కోట్ల విలువైన లాంబోర్గిని కారుని తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. గతంలో పునీత్ జాగ్వార్ కారుని బహుమతిగా అందించాడు. ఉమెన్స్ డే రోజే భార్య కోసం 5 కోట్లు ఖర్చు చేస్తే ఇక పుట్టినరోజు లాంటి ముఖ్యమైన సందర్భాల్లో ఇంకెత ఖర్చు చేస్తాడో అని నెటిజన్లు, పునీత్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇద్దరు మాత్రమే
ఈ ఏడాది పునీత్ నటసార్వభౌమ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పునీత్ యువరత్న చిత్రంలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్ ఐదుగురి సంతానంలో పునీత్, శివరాజ్ కుమార్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదిగారు.


Click it and Unblock the Notifications











