Don't Miss!
- News
బీజేపీ కోసం తెలంగాణలో పవన్‌కల్యాణ్ రాజకీయం??
- Sports
వచ్చే సీజన్ ఆరో ట్రోఫీ పక్కా.. హామీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్నా.. నేను చనిపోయినా బాగుండేది.. స్టార్ హీరో ఎమోషనల్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన అనంతరం అభిమానులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త అబద్ధం అయితే బాగుండు అని ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. ఇంకా పునీత్ రాజ్ కుమార్ మనతోనే ఉన్నట్లు అనిపిస్తోంది.. అని సీనియర్ హీరో ఇటీవల శరత్ కుమార్ కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అంతే కాకుండా ఆయన చేసిన మరి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ అందరిని కంటతడి పెట్టించాయి.

పునీత్ మరణం..
అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో బెంగళూరు లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త వినగానే కొంతమంది అభిమానులు కూడా గుండెపోటుతో తనువు చాలించారు. మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు అంటే పునీత్ వారి గుండెల్లో ఎంత బలంగా స్థానం సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాల కారణంగా కూడా జనాల హృదయాల్లో ఒక మంచి వ్యక్తిగా కూడా గుర్తింపు అందుకున్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు కూడా ఉచితంగా విద్యను అందించారు.

టాలీవుడ్ హీరోలతో అనుబంధం
ఇక పునీత్ రాజ్‌కుమార్ మరణవార్తను కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయినా కొంతమంది సినీ తారలు ఇటీవల పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా పరామర్శిస్తారు. పునీత్ రాజ్ కుమార్ తో టాలీవుడ్ హీరోలకు కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ వంటి వారితో పునీత్ ఎంతో స్నేహంగా ఉంటారు.

కంటతడి పెట్టుకున్న శరత్ కుమార్
మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్ సంస్మరణ సభ నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూనే కంటతడి పెట్టుకున్నారు. పునీత్ నటించిన ఒక సినిమాలో శరత్ కుమార్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా శరత్‌కుమార్ కనిపించారు. ఆ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. పునీత్ చివరి సినిమా జేమ్స్లో కూడా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

నేను మరణించినా బాగుండేది
ఇక శరత్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ను గుర్తుచేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. 'పునీత్ బదులు నేను మరణించినా బాగుండేది అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇక ఇదే వేదికపై రాజకుమార మూవీ వంద రోజుల సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి అంటూ.. పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని తాను కలలో కూడా ఊహించలేదని తెలిపారు. ఇక నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడని అనుకున్నాను.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చిందని.. భావోద్వేగానికి లోనయ్యారు.