సీఎం కొడుకుతో బ్రేకప్.. కుర్ర హీరోతో హీరోయిన్ డేటింగ్.. చిరంజీవి అల్లుడితో..
కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. యువ హీరోతో అతి చనువుగా దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. దాంతో రచితా ప్రసాద్ పెళ్లిపై జోరుగా చర్చ జరుగుతున్నది. అయితే ఆ ఫోటో ఇటీవల కాలంలో దిగిందా? లేక పాత ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగు చూస్తుందా అనే ప్రశ్నలు ఓ వైపు వస్తుండగా.. మరో వైపు రచితా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకు రచితా పెళ్లి వ్యవహారం ఏమిటి? ఆమె చేసిన కామెంట్లు ఏమిటంటే..

కన్నడలో స్టార్ హీరోయిన్‌గా
హీరోయిన్ రచితా ప్రసాద్ తన కెరీర్‌ను హీరో దర్శన్ నటించిన బుల్‌బుల్‌తో మొదలుపెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 20 చిత్రాల్లో నటించారు. గత కొన్నేళ్లలో కన్నడలోని స్టార్ హీరోలు పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్, గణేష్, శ్రీ మురళి, ఉపేంద్ర, సుదీప్, రమేష్ అరవింద్, చిరంజీవి సర్జా, ధ్రువ్ సర్జా, దునియా విజయ్ లాంటి వారితో నటించారు. ఇప్పటికిప్పుడు లెక్కిస్తే ఆమె చేతిలో 10కి పైగా చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న హీరోయిన్లో రచితా రామ్ టాప్ అనేది ఇక చెప్పనక్కర్లేదు.

తెలుగులో కల్యాణ్ దేవ్‌తో సూపర్ మచి
కన్నడ పరిశ్రమలో హవా కొనసాగిస్తూనే ప్రస్తుతం రచితా రామ్ తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న సూపర్ మచి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఈ సినిమా షూటింగ్ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని షూటింగును మొదలు పెట్టారు. ఈ చిత్ర షూటింగులో రచితా రామ్ త్వరలోనే జాయిన్ కాబోతున్నట్టు సమాచారం.

గతంలో నిఖిల్ కుమారస్వామితో ప్రేమలో
గతంలో రుచితా రామ్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, యువ హీరో నిఖిల్ కుమారస్వామితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. వారిద్దరి పెళ్లి వార్తలు కూడా కన్నడ మీడియాలో గుప్పమన్నాయి. అయితే నిఖిల్ కుమారస్వామి పెళ్లి రేవతితో జరుగగానే ఆ వార్తలకు బ్రేక్ పడింది. దాంతో రచితా రామ్ పెళ్లి, ప్రేమ వార్తలు కొన్ని నెలలు సద్దుమణిగాయి.

తాజాగా ధన్వీర్ గౌడతో ప్రేమలో
ఇక ఇటీవల కాలంలో రచితా రామ్ ప్రేమ, పెళ్లి వార్తలు మరోసారి జోరందుకొన్నాయి. గత కొద్దికాలంగా ధన్వీర్ గౌడతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ధన్వీర్ గౌడతో సెల్ఫీ వ్యవహారం ఆ వార్తలకు బలం చేకూర్చాయి. అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ఇటీవల మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

గౌడ అబ్బాయినే పెళ్లాడుతాను
తన పెళ్లి వార్తలతో రచితా రామ్ స్పందిస్తూ.. నాకు ప్రేమ వివాహమైనా ఫర్వాలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా నాకు పట్టింపు లేదు. నేను ప్రేమ వివాహానికి, అరెంజ్డ్ మ్యారేజ్‌కు రెడీ. మేము గౌడ కులానికి చెందిన వాళ్లం. నేను గౌడ కులానికి చెందిన అబ్బాయినే పెళ్లి చేసుకొంటాను అని రచిత రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో రచితా రామ్ పెళ్లిపై మీడియాకు ఓ క్లారిటీ వచ్చేసింది.
Recommended Video

ధన్వీర్ గౌడ్ కెరీర్ ఇలా
అయితే పెళ్లి గురించి రచితా రామ్ క్లారిటీ ఇచ్చేసినప్పటికీ.. ధన్వీర్ గౌడ నుంచి మాత్రం తన రెస్పాన్స్ రాలేదు. అయితే ధన్వీర్ గౌడ మనసులో ఏముందనే విషయంపై మీడియా రకరకాల ఊహాగానాలు చేస్తున్నది. ఇక ధన్వీర్ గౌడ కెరీర్ విషయానికి వస్తే.. సింపిల్ సునీ రూపొందించిన బజార్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం హరీష్ సంతోష్ రూపొందించే బంపర్ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











