కూతురు పరిస్థితి చూసి యష్ కంటతడి.. గుండె పగిలిపోయిందంటూ భార్య
Recommended Video
ఎంతటి సూపర్‌స్టార్ అయినా భావోద్వేగాలకు స్పందించాల్సిందే. పిల్లల విషయంలో స్టార్లు ఎక్కువగా ఫీలైన సంఘటనలు తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో కేజీఎఫ్ హీరో యష్ చేరిపోయారు. కేజీఎఫ్ తర్వాత సోషల్ మీడియాలో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు. అంతేకాకుండా ఆయన కుటుంబం కూడా అంతే చేరువైంది. యష్ కూతురు ఐరా కూడా ప్రేక్షకులకు ఇష్టంగా మారారు. అలాంటి చిన్నారి విషయంలో యష్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం మీడియాను ఆకర్షించింది. ఇంతకు యష్ ఎందుకు కంటతడి పెట్టుకొన్నారంటే..

కూతురు బాధను చూసి యష్
రాకింగ్ స్టార్ యష్, ఆయన భార్య రాధిక పండిట్ ఇటీవల ఇంటిలో తమ కూతురు ఐరాకు చెవికి పోగులు కుట్టించారు. ఈ సందర్భంగా చిన్నారి గుక్కపెట్టి ఏడ్చిందట. దాంతో కూతురు పరిస్థితిని భరించలేక యష్ బాధపడుతూ ఏడ్చినంత పనిచేశాడట. ఈ విషయాన్ని యష్ భార్య రాధిక పండిట్ సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు.

గుండె పగిలిపోయిందని
యష్ భార్య రాధిక పండిట్ తన కూతురు ఫొటోను షేర్ చేసి ఓ కామెంట్ పెట్టింది. ఐరాకు చెవి పోగులు కుట్టించాం. తల్లిదండ్రులుగా మేము ఆ విషయాన్ని చూసి భరించలేకపోయాం. ఆర్య ఏడుపు చూసి మా గుండె పగిలినంత పనైంది. తొలిసారి రాకింగ్ స్టార్ కళ్లలో నీళ్లు తిరగడం తొలిసారి చూశాను. అప్పుడే అనిపించింది. కూతురుపై యష్‌కు ఎంత ప్రేమ ఉందో అనే విషయం అప్పుడే తెలిసింది. ఇప్పుడు తండ్రి, కూతుళ్లు హ్యాపీగా ఉన్నారు అంటూ రాధిక పండిట్ తెలియజేశారు.

ప్రేమ వివాహం తర్వాత
యష్, రాధిక పండిట్‌ది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. ఆరేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత 2016లో వివాహం చేసుకొన్నారు. పెళ్లి తర్వాత రెండేళ్లకు వారికి ఐరా జన్మించింది. ప్రస్తుతం రాధిక పండిట్ గర్బవతి కావడంతో రెండో బిడ్డ కోసం యష్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే యష్ రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నారు.

కేజీఎఫ్2 షూటింగ్‌తో బిజీగా
ఇక యష్ కెరీర్ విషయానికి వస్తే.. కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ జాతకమే మారిపోయింది. ఒక్కసారి జాతీయ స్థాయి హీరోగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.250 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. కేజీఎఫ్ అందించిన ఉత్సాహంతో స్వీక్వెల్‌ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో యష్ నటించిన కేజీఎఫ్‌కు రెండు అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











