ఘనంగా రాజ్ కుమార్ మనవడి వివాహం.. చిరంజీవి, యష్, రష్మికతోపాటు ప్రముఖుల హాజరు (ఫొటోలు)
కన్నడ సూపర్ స్టార్, స్వర్గీయ రాజ్ కుమార్ మనవడు, హీరో రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు యువ రాజ్ కుమార్ వివాహం బెంగళూరులో ఆదివారం ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన పెళ్లి వేడుకకు దక్షిణాది అగ్రతారలందరూ హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన పెళ్లి విందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరో హీరోయిన్లు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుక గురించి మరిన్ని వివరాలు...

చిరంజీవి నివాసానికి వచ్చిన రాజ్ కుమార్ తనయులు
కొద్ది రోజుల క్రితం రాఘవేంద్ర రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వచ్చి యువ రాజ్ కుమార్ పెళ్లి పత్రికను స్వయంగా ఇచ్చి ఆహ్వానించారు. దాంతో తనకు అత్యంత ఆప్తులైన రాజ్ కుమార్ కుటుంబంలోని పెళ్లికి తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఆదివారం ఉదయం పెళ్లి.. సాయంత్రం రిసెప్షన్
ఆదివారం ఉదయం జరిగిన కల్యాణ మహోత్సవంలో శ్రీదేవి బైరప్పను యువ రాజ్ కుమార్ వివాహం చేసుకొన్నారు. సాయంత్రం భారీ రేంజ్‌లో బెంగళూరు ప్యాలేస్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పునీత్, శివ రాజ్ కుమార్‌లు అతిథులను రీసీవ్ చేసుకొన్నారు. ఈ వేడుకలో కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు.

భారీగా తరలివచ్చిన సినీ ప్రముఖులు
యువ రాజ్ కుమార్ వివాహం వేడుకకు భారీగా తరలివచ్చారు. పెళ్లికి హాజరైన వారిలో హీరోయిన్లు రచిత రామ్, రష్మిక మందన్న, హరిప్రియ, తదితరులు ఉన్నారు. హీరోలో యష్, ఉపేంద్ర దంపతులు, ఇతర హీరోలు హాజరయ్యారు.

గతేడాది జూలైలో నిశ్చితార్థం..
శ్రీదేవి, యువ రాజ్ కుమార్ వివాహ నిశ్చితార్థం జూలైలో జరిగింది. కొద్దికాలంగా శ్రీదేవీతో యువ రాజ్ కుమార్ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కుదిరింది. కన్నడ పరిశ్రమలో అత్యంత వైభవంగా జరిగిన పెళ్లిలో ఒకటిగా క్రేజీగా నిర్వహించారు.

యంగ్ హీరోగా యువ రాజ్ కుమార్
రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడైన యువ రాజ్ కుమార్ కన్నడ సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు. యువ హీరోగా తన ప్రతిభతో రాజ్ కుమార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











