For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫర్ కోసం వెళితే ఇంటికి రమ్మన్నాడు.. ప్రముఖ సింగర్ కాపురంలో గాయని చిన్మయి చిచ్చు!

|

చిత్ర పరిశ్రమలో 'మీటూ' సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. చాలా మంది బాధితులు బయటకు వచ్చి తమ గోడును వెల్లగక్కారు. సోషల్ మీడియా వేదికగా తమ బాధను వినిపించారు. దీనివల్ల ఎంతో మంది సినీ పెద్దల బండారాలు బయటపడ్డాయి. కొందరి కాపురాలు కుప్పకూలిపోయాయి. ఇప్పుడిదే జాబితాలోకి మరొకరు చేరిపోయారు. కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన.. భార్య మయూరి శనివారం బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ జంటకు కొన్ని వారాల గడువు ఇచ్చినట్లు తెలిసింది.

సంవత్సర కాలంగా విభేదాలు

వాస్తవానికి సంవత్సరం కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. దీనికి కారణం రఘుపై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడం.. వాటిని ఆయన ఒప్పుకోవడమే. గతంలో రఘుపై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ భార్య) సంచలన ఆరోపణలు చేసింది. అవకాశం కోసం ఆయన ఆఫీసుకు వెళ్తే తన ఇంటికి రమ్మన్నాడని చిన్మయి చెప్పడం అప్పట్లో కలకలం రేపింది. అంతేకాదు, తన స్నేహితురాలితో కూడా రఘు అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె చెప్పుకొచ్చింది. చిన్మయి చేసిన ఆరోపణలు కన్నడ చిత్ర సీమలోనే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.

చిన్మయి ఆరోపణలు నిజమేనని

తనపై వస్తున్న ఆరోపణలపై రఘు వెంటనే స్పందించాడు. చిన్మయి తనపై చేసిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఆమె చెప్పినట్లు తాను ఓ సింగర్‌తో అసభ్యంగా ప్రవర్తించానని స్పష్టం చేశాడు. ‘‘ఓ పాటను రికార్డ్ చేస్తున్న సమయంలో ఉద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలోనే ఆమెను గట్టిగా హత్తుకున్నాను. ముద్దు పెట్టుకునేందుకు కూడా ప్రయత్నించడంతో ఆమె నన్ను పక్కకు నెట్టేసింది. దీనిపై ఆమెకు ఆ క్షణంలోనే క్షమాపణలు కూడా చెప్పేశాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి క్షమాపణలు బహిరంగంగా చెబుతున్నాను'' అంటూ ఈ సింగర్ చెప్పుకొచ్చాడు.

విడిపోవడానికే నిర్ణయం తీసుకొని

సింగర్ రఘు తప్పు చేసినట్లు ఒప్పుకున్నప్పటి నుంచి ఆయన భార్య మయూరి ముభావంగా ఉంటోందట. తనను మోసం చేశాడనే ఉద్దేశ్యంతో తరచూ గొడవలు పడడం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య గొడవలు ఆపేందుకు ఇరు కుటుంబాలకు చెందిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదని తెలిసింది. ఇటీవల మరోసారి కలిసిన కుటుంబ పెద్దలు ఈ దంపతులకు సర్ది చెప్పేందుకు ట్రై చేశారట. విడిపోయినా పరస్పర సహకారం అందించుకుంటామని ఈ జంట చెప్పడంతో వాళ్ల నిర్ణయానికే వదిలేశారని సమాచారం.

నా భార్యకు విడాకులు ఇస్తున్నా

తాజాగా తన భార్యతో విడాకుల వార్తపై రఘు దీక్షిత్ వివరణ ఇచ్చారు. నా భార్యకు నేను విడాకులు ఇస్తున్నాను. మూడేళ్లుగా కలిసి ఉండటం లేదు. మా విడాకుల కేసు చివరి దశలో ఉంది. నా భార్య చాలా మంచింది. నేను మంచి భర్తను కాదు అని రఘు దీక్షిత్ వివరణ ఇచ్చారు. పరస్పర అవగాహనతో వీరిద్దరూ విడాకుల కోసం కోర్టుకెళ్లారని వినికిడి.

English summary
Tamil singer Chinmayi Sripada had accused the musician Raghu Dixit of sexually harassing her. Raghu Dixit had also asked for forgiveness if his actions were interpreted as sexual advances. At the same time, he had revealed that his divorce with wife Mayuri was being finalised.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more