చిన్మయితో అసభ్యంగా ప్రవర్తించా.. అందుకే నాకు నా భార్య విడాకులు
కన్నడ సింగర్ రఘు దీక్షిత్ తన కాపురంలో చోటు చేసుకొన్న కలతలపై వివరణ ఇచ్చారు. తన భార్యతో విడాకుల వార్తపై రఘు దీక్షిత్ క్లారిటీ ఇచ్చారు. నా భార్యకు నేను విడాకులు ఇస్తున్నాను. మూడేళ్లుగా కలిసి ఉండటం లేదు. మా విడాకుల కేసు చివరి దశలో ఉంది. నా భార్య చాలా మంచింది. నేను మంచి భర్తను కాదు అని రఘు దీక్షిత్ వివరణ ఇచ్చారు. పరస్పర అవగాహనతో వీరిద్దరూ విడాకుల కోసం కోర్టుకెళ్లారని సమాచారం.
గాయని చిన్మయి తనపై చేసిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఆమె చెప్పినట్లు తాను ఓ సింగర్‌తో అసభ్యంగా ప్రవర్తించానని స్పష్టం చేశాడు. ''ఓ పాటను రికార్డ్ చేస్తున్న సమయంలో ఉద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలోనే ఆమెను గట్టిగా హత్తుకున్నాను. ముద్దు పెట్టుకునేందుకు కూడా ప్రయత్నించడంతో ఆమె నన్ను పక్కకు నెట్టేసింది. దీనిపై ఆమెకు ఆ క్షణంలోనే క్షమాపణలు కూడా చెప్పేశాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి క్షమాపణలు బహిరంగంగా చెబుతున్నాను'' అంటూ రఘు దీక్షిత్ వెల్లడించారు.

సింగర్ రఘు తప్పు చేసినట్లు ఒప్పుకున్నప్పటి నుంచి ఆయన భార్య మయూరి ముభావంగా ఉంటోందట. తనను మోసం చేశాడనే ఉద్దేశ్యంతో తరచూ గొడవలు పడడం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య గొడవలు ఆపేందుకు ఇరు కుటుంబాలకు చెందిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదని తెలిసింది. ఇటీవల మరోసారి కలిసిన కుటుంబ పెద్దలు ఈ దంపతులకు సర్ది చెప్పేందుకు ట్రై చేశారట. విడిపోయినా పరస్పర సహకారం అందించుకుంటామని ఈ జంట చెప్పడంతో వాళ్ల నిర్ణయానికే వదిలేశారని సమాచారం.


Click it and Unblock the Notifications











